మానవాళికం

68.) చీకటి అంటే అర్థం ఏమిటి మరియు వెలుగుకు అర్థం ఏమిటి?

కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో జీవించుట యందు అవి జీవిత కాలక్రమదారులుగా సాగెను.అలా నాల్గు వయస్సుప్రమాణికమున తొడుగు ప్రమాణికములో జీవస్థితి ప్రమాణికములు జీవించును.వృద్ధ నిర్వహణ చివరిదశకు వచ్చేకొలది జీవితకాలం పూర్తి అగును.ఇటువంటి జీవితములో విషయసన్నివేశములకు తగ్గట్టుగా కష్టాలు,సుఖాలు,మంచి,చెడులు, అబద్ధాలు,నిజాలు,స్వార్థాలు,కుల్లులు,కుతంత్రాలు,ప్రేమ,అభిమానములు ఇలా అనేక పొర ప్రభావితములు విషయసన్నివేశము తగ్గట్టుగా అలవరిచి కదిలించి జీవింపచేస్తేనే అందులో వెలుబడిన అనుభవములను బట్టి మన శిరస్సు మధ్యలో నిల్వరింపబడిన అంతర్వాణి నుంచి కష్టము,సుఖము అనే పదాలు మననోటి నుంచి వెలువరింపబడటం జరిగెను.కాబట్టి బాహ్యము అన్నది అడుగు అడుగు అర్థచింతన పరనడుమున సాగును. అలా ప్రతిపదానికి అర్థం ఎరుగుటలో ఇది సంపూర్ణ అర్థ నిర్వహణ యొక్క నడకయే కావున అన్ని కాలాలు ఏకకాలంలో మొదలైన సమయస్థితి యందు నుంచి ఆ కాలక్రమదారులలో నిరంతర పాత్రపోషణల నడుమున జీవిస్తూనే వున్నాము.మొదలు జీవితకాలం పూర్తి అయితే గిట్టి మరళ పుట్టడము.ఆ తరువాత మన అనుభవపూర్వకమున గూడును విడనాడితే చచ్చిపుట్టుడం మొదలయ్యెను.దీని ప్రకారంగా చూస్తే గడిచిన కాలక్రమదారులనే చచ్చిపుట్టి మరళ మరళ జీవిస్తూనే వున్నాము.కావున ఈ వెలుతురు చీకటిలు అన్నవి ఈ మానవజన్మ పరనడుమున జీవిత కాలక్రమదారులలో జీవించబడి అనుభవము వెలుబడి ఆ అనుభవాల్ని బాహ్యములో ప్రదర్శనాపూర్వకముగా పెట్టుటలో మన అనుభవసారములో నుంచి పుట్టుకొచ్చింది వెలుతురు.ఎందుచేతననగా జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవపూర్వకమున నిరంతరము కాలక్రమదారిలో జీవిస్తూనే యుండుటలో బాహ్యపు తెరల పరనడుమున ఈ తోలుబొమ్మ కదిలాడుతూనే వున్నట్లు అది వెలుతురుకు అర్థం ఎప్పుడైతే ఒక్కొక్క దారి అలవరికలో స్థిరస్థితి అయిన అనుభవంలేక అటుఇటుగా మలుచుకొని స్థిరస్థితిని కోల్పోయి ఆ తీగఅల్లికతో కూడుకోబడిన దారిలో ఊగిసలాట, తొనికిసలాట పరనడుమున ఒత్తిడి చెంది కదలకుండానే జీవస్థితి ప్రమాణికములు ఆగిపోవుటలో అప్పుడు తెరలపైన ఈ తోలుబొమ్మ కదలకుండా వచ్చును.దానిని బట్టి ప్రాకృతికమండలము వెలుతురును కొంచెంకొంచెంగా తొలిగిస్తు చీకటిని అలవరుస్తు వచ్చును.అలా జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవపూర్వకమున పూర్తి స్థిరస్థితిగా నిలద్రొక్కుకోలేనంత వరకు ఈ జీవితప్రయాణం వెలుతురు చీకటిల మధ్య సాగును.కాబట్టి అవి పొరప్రభావితములు వాటిని కాలగర్భ ప్రాకృతికమండలము అలవరుచును.

Download PDF Now