మానవాళికం

72.)నిరంతర ప్రయాణం అంటే ఏమిటి?

కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవుతు రావుటలో కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణము కూడ పూర్తి అయ్యెను. ఆ తరువాత ఒక్కొక్క కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు నాల్గు వయస్సు ప్రమాణికమున తొడుగుప్రమాణికములలో ఒక్కొక్క పాత్రపోషణల నడుమున జీవించడం మొదలయ్యెను.ఏలననగా కాలము కదిలి సమయము ముందుకు సాగి దారి కదులుటలో అక్కడి నుంచి శ్వాస వెలువరింపబడి ఆ శ్వాస స్థూలతొడుగు ముక్కుకొన నుంచి ప్రథమశ్వాసనాళము,శ్వాసనాళ ప్రక్రియ నుంచి నాభి మధ్యమమునకు చేరుకొని నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడిలో అదే వివరణతో కూడుకోబడిన కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదులుతు పోవును. అప్పుడు అది కాలక్రమదారిలో కదిలి జీవించినట్లే.ఆ తదుపరి అన్ని కాలాలు ఏకకాలంలో కదలడము అన్నది మొదలు అగును.అప్పుడే అవి జీవిత కాలక్రమదారులుగా అలబడుటలోనే ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులలో ప్రయాణం అన్నది సాగుతూనే వచ్చును.కావున అది జీవిత ప్రయాణముగా అలబడుతు వచ్చెను.అలా మన మందరము నిరంతర కాలక్రమదారులలో ప్రయాణిస్తూనే వున్నాము,ఆ ప్రయాణములో జీవిస్తున్నాము కాబట్టి అన్ని కాలాలు ఏకకాలంలో కదలడము అన్నది మొదలు అగుటలో కాలము ఎవరికోసము ఆగదు అన్నటుల నిరంతరము కాలగర్భం ప్రాకృతికమండలాల ఆధారంగా కాలక్రమదారులు కదులుతు పోతూనే యుండును.ఆ దారులలో శ్వాసస్థితి ఆధారంగా మనము జీవిస్తు ప్రయాణిస్తునే వుండెదము.ఒకవేళ ఒక్కొక్క కాలక్రమదారులలో స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడక పోవుటతో జీవస్థితి ప్రమాణికములు ఈ స్థూల తొడుగును విడనాడిన ఏ కాలక్రమదారులలో మనయొక్క ప్రయాణం ఆగిపోయెనో మరళ పుట్టుట యందు అక్కడి నుంచే మనయొక్క ప్రయాణం సాగును.కాబట్టి నిరంతర కాల సమయస్థితితో కూడుకోబడిన దారులు అయితే ముందుకు సాగుతూనే వున్నాయి కాని మనము గడిచిన కాలక్రమదారులలోనే చచ్చిపుట్టి మరళ మరళ ప్రయాణిస్తున్నాము.కాని ప్రస్తుత ఇప్పటివరకు జీవితకాల ప్రయాణములో ఎక్కడ వున్నామో తెలియరాలేదు. కాబట్టి నిరంతరము కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవిస్తు వుంటేనే అవి జీవములో వున్నట్లు అలా జీవస్థితి ప్రమాణికములు జీవముతో వుంటేనే ఈ స్థూల తొడుగు సజీవముగా వున్నట్లు.

Download PDF Now