మానవాళికం

33.ఎవరికివారికిగా వాళ్ళ అనుభవమే నిలబెడుతుంది అని అనుటలో వాళ్ళ గతగతస్థితులు వాళ్లకు తెలియరావలె?

మొదలు జీవము జీవప్రమాణిక దశలే కావున మానవజన్మ పరనడుమున జన్మనెత్తడము అనగా శిరస్థాయి మధ్యమ నిర్వహణలో బ్రహ్మరంధ్రం చుట్టు అలవరిచిన జన్మపర్యంతపుపొరలు, ఆ పొరల లోనే తీగల అల్లికలతో కూడుకోబడిన దారులు ఆ పొరలలో నిల్వరింపబడియుండుటలో జీవతత్వపొర పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. జీవము జీవప్రమాణిక దశలో ఆ జన్మపర్యంతపు తీగలలో జీవము జీవప్రమాణికములను ఒక తీగ అలవరిక తరువాత ఒకతీగ అలవరికలో ప్రవేశపెట్టడం జరిగెను. కావున వాటినే జన్మపర్యంతపుపొరలు అనెదము. ఆ జన్మపర్యంతపుపొరల మధ్యమభాగం యందే బ్రహ్మరంధ్రం, ఆ బ్రహ్మరంధ్రం నుంచియే ప్రథమనాడులు పుట్టుకరాబడుట ద్వారా ఆ ప్రథమ నాడులలో నిల్వరింపబడిన స్థూలనాడీమండలాలు అవియే స్త్రీనాడీమండలము. అందులో స్త్రీ కణాలు నిల్వరింపబడియుండును. ఆ తదుపరి పురుషనాడీమండలము అందులో పురుష కణాలు నిల్వరింపబడియుండును. అదేవిధంగా తల్లి తండ్రి, సోదరి సోదరుడు ఇలా వయస్సుకు తగ్గట్టుగా పెరిగే పాత్రపోషణలు కాబట్టి ఒక్కొక్క నాడీమండల నడకకు గాన ఒక పాత్రపోషణ వర్తించును. కావున జన్మపర్యంతపుపొరల ఆధారంగా జన్మనెత్తడము అని అనుటలో ఆ జన్మపర్యంతపు పొరలలో నిల్వరింపబడిన తీగల అల్లికలలోని జీవప్రమాణికములు స్త్రీ నాడీమండలములో స్త్రీకణాలలోనికి, పురుష నాడీమండలములోని పురుష కణాలలోనికి ప్రవేశపెట్టడం జరుగును. అదేవిధంగా మిగితా నాడీమండల కణాలలోనికి కూడ జీవప్రమాణిక దశలో ప్రవేశపెట్టడం జరుగును. అలా ప్రవేశపెట్టిన తరువాతనే కాలక్రమముల ఆధారంగా ఆ కణాలను ప్రథమనాడులలోనికి విడుదల చేయుటలో అవి కణకదలిక సారాంశయుతతీగల అల్లికలుగా విచ్చుదల అగును. ఆ తరువాత కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులే ప్రథమనాడులలోని కణకదలిక సారాంశయుతతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు అవుట ద్వారా కాలసమయస్థితి ప్రకారంగా అక్కడి నుంచి శ్వాస వెలువరింపబడి ఆ శ్వాస స్థూలతొడుగు ముక్కుకొన నుంచి ప్రథమశ్వాసానాళం, శ్వాసానాళ ప్రక్రియ నుంచి నాభి మధ్యమములోనికి చేరుకొని నాభి మధ్యమభాగం నుంచి నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడిలోని అదే వివరణతో కూడుకోబడిన కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా ఆ జీవస్థితి ప్రమాణికములను కదిలించి జీవింపచేయడం జరుగును. అలా నాల్గు వయస్సు ప్రమాణికమున ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవింపచేయడం జరుగును. అలా జీవింపచేయుటలో అవి అనుభవమైన దారులుగా మారును, చివరకు అవి మనస్సు దారులుగా మారును. ఆ దారులలో జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో తాము జీవించగా జీవించగా కొంచెంకొంచెంగా అనుభవస్థిరస్థితి అన్నది అలబడుతు పోవును. ఆ స్థిరస్థితిలోనే అనుభవసారముచే కూడగట్టబడును. కాబట్టి జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో తాము అనుభవసారస్థితి పరనడుమున నిలద్రొక్కుకొనును. కాబట్టి తమ అనుభవములో తాము ఎలా నిలద్రొక్కుకొని ప్రయానిస్తున్నారో తెలియరావలెనంటే వాళ్ళపై వాళ్లకు గమనము ఏర్పడవలె.

Download PDF Now