మానవాళికం

34. మనయొక్క మనస్థత్వమే మనకు వెనుతిరుగుటలో మన మనస్సులో మనము వుండలేకపోదుము ఎలా?

కాలక్రమదారులలో జీవించబడుట యందు ఆ దారులలో అనుభవము వెలుబడును. కావున అవి మన అనుభవమైన దారులుగా చివరకు మనస్సుదారులుగా మారును. ఆరకంగా చూస్తే మనకు ప్రతిఒక్కరికి మనస్సు అన్నది ఒకటి వున్నది, వాళ్ళ మనస్సుదారులు వాళ్ళ అనుభవమైన దారులుగా మనము అనెదము. ఎవరి మనస్సు వారికి అర్థం కావలె అనెదము. కాని ప్రస్తుత ఇప్పటి వరకు చూస్తే ప్రతిఒక్కరికి మనస్సులోతు అన్నది ఎంతవరకు ఏర్పడినదో ఎంతటి విస్తారతతో కలిగియున్నదో తెలియరాలేదు. కాస్త అనుభవలోతు కల్గినవాళ్ళు వాళ్ళ మనస్సు బాగలేదనో వాళ్ళ మనస్సు గందరగోళంగా వున్నదనో చెప్తుంటే మనము విన్నాము. అదేవిధంగా మనస్సు బాగావుంటే ఏదైనా ఏకాగ్రతగా వినగల్గడము లేక చూడగల్గడం ఏపనినైన శ్రద్ధగా చేయగల్గడము అలా ఏకాగ్రత, శ్రద్ధ, పటుత్వము అన్నది అలబడుతు పోవును. కావున మనస్సు తేలికిగా వుండుటలో దేహం కూడ తేలికగా యుండును. అలాగే మనస్సు లోతుల్లో మనిషిగా తయారుకాక పోగా ఆ మనస్సుదారులలో స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడకమునుపే ఆ దారులను అటుఇటుగా వంకరముగా మలుచుకొనుటలో మనస్సుపొరయే మనస్థత్వ పొరగా మారెను. కాబట్టి ఆ మనస్థత్వ దారులు ఎలా కదిలితే అలాగే మనిషి అనే ఈ స్థూలదేహములోని జీవప్రమాణికములు కదులును. ఎందుచేతననగా మనస్సు అనునది ఒక ప్రకృతి యొక్క అణువు. ఆ అణువుయే మనస్సు అనే పొరను విడుదల చేయును. ఆ పొరలోనే ఈ దారులు నిల్వరింపబడియుండును. కావున అవి మనస్సుదారులుగా కదులును. కాబట్టి ఆ దారులను ఎలా మలుచుకుంటే అలా ఆ మనస్సు అనే ప్రకృతి యొక్క అణువు కదులును ఆ వంకరదారులలోనే. ఒకమారు, రెండుమార్లు, పదిమార్లు, వందలమార్లు ఆ వంకరదారులలో కదిలినట్లైతే ఆ మనస్సు అనే పొర కూడ అన్నేమార్లు కదులును. కావున మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమమును అలవరుచుట ద్వారా అవియే అనాలోచితములుగా కదులుతూనే వుంటాయి. కాబట్టి ఆ మనస్సుదారులను వంకరదారులుగా మలుచుకొనుటకు కారణములు ఏవో గుర్తు ఎరిగి ఎప్పటికప్పుడు సరిమల్చుకోక ఎన్నో విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను అలాగే మలుచుకోవుట ద్వారా మన మనస్సును మభ్యపరుచుకుంటు రావుటలో ఇప్పుడు ఆ మనస్థత్వపొర ప్రభావితములో దారులు వంకరముగా కదిలాడుతుంటే ఎవరి మనస్థత్వ నడకల్లో వాళ్ళు ఉండలేనిస్థితికి వచ్చాము. కాబట్టి మన మనస్సులోని మనయొక్క అనుభవపూర్వక స్థితిగతులు గుర్తు ఎరిగి సరిమలిస్తే తప్ప మన మనస్సు మరళ యథాస్థితికి రాదు.

Download PDF Now