మానవాళికం

35. ఒక్కొక్కరక మనస్థత్వాన్ని బట్టి మానసికము అన్నది ఎలా తయారుకాబడుతు పోవును?

ప్రతిఒక్కరికి మనస్సన్నది వున్నది అని అనుటలో వాళ్ళ మనస్సులోని దారులు వాళ్ళ అనుభవమైన దారులు. ఆ దారులలో జీవించబడుతు అనుభవస్థిరస్థితి కొంచెంకొంచెంగా అలబడుతుంటే ఇంకొంచెం స్థిరత్వంగా జీవప్రమాణికములు నిలద్రొక్కుకొని తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదులుతు జీవించవలె. అప్పుడే ఎవరికివారికిగా వాళ్ళ మనస్సుదారులు సరిఅర్థ పరనడుమున సరివివరణంగా కదులుతుంటే మనస్సు తేలికగా కదులుటలో మనిషియైన ఈ స్థూలతొడుగు తేలికగా కదులుతు వుండతముతో పాటు మనస్సు అద్దంలో కాంతివంతముగా జీవకళ ఉట్టిపడుతున్నట్లు ముఖవర్చస్సు పెరిగి చర్మపుపొర సౌష్టవము చక్కగా మనస్సులో మనిషిగా ఎదుగుతున్నట్లు మనసద్దమంత మనిషి కానవచ్చును. అలా కాక ఎవరికివారుగా వాళ్ళ మనస్సుదారులలో స్థిరస్థితిగా దారులలో నిలద్రొక్కు కునేలోపే అర్థం అయ్యి కాక, ఇష్టము అయిష్టత చేత, సంతృప్తి అసంతృప్తి పరనడుమున ఎందుచేతననగా అర్థం అయిన జీవిత నిర్వహణ పట్ల యిష్టమయిన, సంతృప్తి అయిన తమ అనుభవములో తాము జీవించబడుటలో ఆ తీగఅల్లికలోని వివరణ పరనడుమున ప్రాకృతిక మండలము స్థూలరసద్రావకాలను ప్రవేశపెట్టి ఆ జీవానుభవమేర మిళితం చేసి సారంగా కూడగట్టుటలో తమ అనుభవసారస్థితిలో జీవస్థితి ప్రమాణికము తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలి జీవించవలె. అలా మరళ మరళ అనుభవసారాన్ని కూడగట్టుటలోనే జీవస్థితి ప్రమాణికములకు తీగఅల్లికలోని వివరణ నడక అర్థం కావడము అయిన, జీవిత సంతృప్తి కల్గడము అయిన, జీవితంపై ఇష్టము కల్గడం అయిన కొంచెంకొంచెంగా అనుభవస్థిరస్థితిని బట్టి అలబడుతు పోవును. అలా పూర్తి స్థిరస్థితి రాకమునుపే జీవస్థితి ప్రమాణికములు ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన దారులను అటుఇటుగా మలుచుకొనుటలో మనస్సుదారులే మనస్థత్వదారులుగా మారును. కాబట్టి ఎవరికివారికి వాళ్ళ అనుభవపూర్వక స్థితిగతులను బట్టి ఇష్టము వచ్చినట్లు మలుచుకొనుటలో ఆ మనస్థత్వ దారులలోనే జీవించడము జరుగును. కావున మనస్థత్వపొరలో వంకరదారులు సరిదారులుగా మల్చనంతవరకు ఆ మనస్సు అనే పడనడకకు సంబంధించిన ప్రకృతి యొక్క అణువు మనస్సుపొరను వంకరదారుల అలవరికకు తగ్గట్టుగా మనస్థత్వపొరగా మలిచెను. కావున మనస్సుదారులు ముందుకు కదులుటకు వుండవు. ఆ మనస్థత్వ పరనడుమున అక్కడక్కడే వంకరదారుల అలవరికలో కదులును. కావున మనస్సుఅద్దం మసకబారును, కాంతివంతము కోల్పోయి జీవకళ లేకుండా పోవును. ఎందుచేతననగా మనస్సు అనే ప్రకృతి యొక్క అణువు అక్కడక్కడే వంకరదారులలో కదులుట ద్వారా. ఆరకంగా చూస్తే ఒక్కొక్కరికి ఒకరక మనస్థత్వం అని అనుటలో కొందరిది అనుమానాస్పద మనస్థత్వం మరికొందరిది పిసినారితనముతో కూడుకోబడిన మనస్థత్వము ఇంకొందరిది వ్యతిరేఖతనముతో కూడుకోబడిన మనస్థత్వం ఇంకను కొందరిది సున్నితమైన మనస్థత్వం ఇలా ఎవరి అనుభవపూర్వక దారులను ఎలా మలుచుకుంటే అలాగే మనస్సు అనే పడనడకకు సంబంధించిన ప్రకృతి యొక్క అణువు కదులును. కావున ఒక్కొక్కరక మనస్థత్వాన్ని బట్టి మానసికము ఒక్కొక్కరకంగా యుండును. మరళ తిరిగి ఆ వంకరదారులను సరిమలిస్తే తప్ప మనస్థత్వపొర కొంచెంకొంచెంగా తొలుగుటతో పాటు మానసికము తొలగి మనస్సుదారులు మరళ యథాతదంగా కదులును. కాబట్టి మానసికము అనగా మన అనుభవపూర్వక దారులను ఎలా మలుచుకుంటే అదేరకంగా మనస్సుపొర మనస్థత్వపొరగా మారి ఆ మనస్థత్వపొరలో వంకరదారులు మరళ మరళ కదులుతుంటే మనిషి అనే ఈ స్థూలదేహంలోని జీవప్రమాణికము ఆ వంకరదారులలో పదేపదే కదలవలె. ఎందుచేతననగా మనస్థత్వదారులలో ఆ వంకరనడకలోనే ఎన్నిమార్లు కదిలి జీవించడం జరిగెనో అన్నే మార్లు ఆ మనస్థత్వదారులు కదులుతూనే యుండును. కాబట్టి అది ఒకర మానసికముగా తయారు అవుతు వచ్చును.

Download PDF Now