మానవాళికం

39.) మనసాక్షి నిక్షిప్తంగా దాగడం అన్నది ఎప్పటినుంచి మొదలయ్యెను?

ప్రతిఒక్కరికి మనస్సన్నది పుట్టుకరావడము, కాలక్రమదారులే వాళ్ళయొక్క అనుభవమైన దారులుగ ఆ తరువాత మనస్సుదారులుగ అలబడటము, ఆ తదుపరి ఎవరికివారుగా వాళ్ళ మనస్సుదారులలో జీవించడము మొదలవడము. అలా వాళ్ళ అనుభవపూర్వక దారులలో వాళ్ళు జీవించుటలోనే ఆ అనుభవములలో కొంచెంకొంచెంగా స్థిరపడుతు రావడము పూర్తిగా స్థిరపడేలోపే వాళ్ళ అనుభవమైన దారులను అటుఇటుగా మలుచుకోవడము అన్నది ఎప్పటినుంచి మొదలుకావడము అన్నది జరిగెనో అప్పటినుంచే మనస్సు పొరప్రభావిత అలవరికలోనే మనసాక్షి నిర్వహణలో ఆ పొరలో అంతర్వాణిని నిల్వరింపచేయడం జరిగెను. కాబట్టి వాళ్ళ వంకరదారుల నడకను వాళ్ళకు తెలియజేస్తూ వచ్చెను మనసాక్షి. అలా మొదలు గుర్తు ఎరుగుతు సరిమల్చుకోవడము అన్నది జరుగుతు వచ్చెను. అలా అనుభవములో పడిలేచి పడిలేచి తమ నడకను మనసాక్షి నిర్వహణలో గుర్తు ఎరిగి సరిమల్చుకుంటు సాగినట్లైతే మనస్సులో మనిషిగా ఎదిగేవాళ్ళము. కాని లోపల ఒకతిక్కు తెలియవస్తున్న సరిమల్చుకొనలేక ఒకదాని తరువాత ఒకటిగా అన్ని వంకరదారులుగ మల్చుకుంటుపోవడము జరిగెను. అలా లోపల తెలియవస్తున్న సరిమల్చుకొనలేక పోవుటతో తోటి అనుభవజ్ఞుల ద్వార తెలియపరిచిన తెలుసుకొనలేక ఇష్టానుసారముగా మలుచుకొనుటలో ఆ వంకరదారుల అలవరికలోనే మనసాక్షిపొర నిక్షిప్తంగా దాగడము అన్నది మొదలయ్యెను. ఆ తరువాత ఆ వంకరదారులలోనే ఆడి ఆడి తమ అనుభవస్థిరస్థితి అంతయు కోల్పోయి పూర్తి నిస్సారపడిపోయి ఎటూ దారి కానరాక దిక్కుతోచని పక్షంన అప్పుడు నిక్షిప్తంగా దాగిన మనసాక్షి ఎలా ఆడితే ఆ స్థితికి చేరుకోవడము జరిగేనో ఎత్తిచూపడము అన్నది జరుగును.

Download PDF Now