మానవాళికం

43.) భయము

విషయసన్నివేశము తగ్గట్టుగా ఈ భయము అనే పొరను అలవరిచి కదిలించి జీవింపచేయడం అన్నది జరుగును. ఆ విషయములో సరియైన స్థిరస్థితి అయిన అనుభవము ఏర్పడకపోగ ఆ విషయములో ఊగిసలాడటము, తొనికిసలాడటము అన్నది తీగఅల్లిక నడకలో ఎప్పుడైతే మొదలగునో అప్పుడు విషయానికి తగ్గట్టుగా ఒక శాతము వుండవలసిన పొర ఆ ఒక్కశాత నిర్వహణలోనే పెరుగుతు పోవును అది భయము ఎక్కువుగా అలబడినట్లు. ఆరకంగా చూస్తే ఒక్కొక్క కాలక్రమ కోణపులోతుల వివరణలు పెరుగుతు పోయేకొలది ఈ భయము అనే పొరప్రభావిత శాతములను పెంచుతు పోవడము అన్నది జరుగును. కాబట్టియే విషయానికి తగ్గట్టుగా భయము వుంటేనే భయానికి అయిన ఒక అర్థం వుంటుంది అని తేలును. కాని ఎవరి మనస్సులోనివి వాళ్ళ అనుభవమైన దారులు అగుటలో వాళ్ళు వాళ్ళ అనుభవమైన దారులలో జీవించుట యందు ఆ అనుభవస్థిరస్థితి అలబడేలోపే ఆ దారులను అటుఇటుగా వంకరముగా మలుచుకొనుటలో అవి మనస్థత్వదారులుగా మారెను. అందున ఆ మనస్థత్వదారులలో విషయానికి తగ్గట్టు కోపము, బాధ, సంతోషము, భయము అన్నవి లేకపోగ అపార్థముల పరనడుమున ఎక్కువతక్కువలుగా అలబడును. అంతేకాకుండా ఒకరిది కోపముతో కూడుకోబడిన మనస్థత్వం అని అనుట యందు అన్ని విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను వంకరముగా మలుచుకొని ఆ వంకరదారులలో జీవించి జీవిత సంతృప్తి అలబడక అలా జీవితము ముందుకు సాగక ఆగిపోయినతనము ఆ వంకరదారులనే పదేపదే తిరిగేస్తు విషయానికి తగ్గట్టుగా ఉండవలసిన కోపాన్ని ప్రతి విషయాన్ని అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుటతో ఈ కోప ప్రభావిత పొర అన్నది అంతటా అలబడుతు పోవును. కాబట్టి వాళ్ళకు ప్రతి విషయములోను కోపమే వస్తుంది. అదేవిధంగానే ఈ భయము విషయానికి తగ్గట్టుగా ఉండవలసిన భయము ఇప్పుడు ప్రతి విషయములోను భయము అలబడుతు పోయెను. అదినూ ఎక్కువతక్కువలుగా అలబడుతు పోయెను. కాబట్టియే దేనిపై ఎక్కువ భయముగా తీసుకుంటామో దేనిపై తక్కువ భయము వుండునో అది మనకే తెలియకపోవడము. ఇంతవరుకు మనము మన మనస్సులోతుల్లోకి పోలేదు. కాబట్టియే మనస్సులోతు ఇంత అని తెలియరాలేదు. ఆరకంగా మన మనస్సులోని దారులను మనము ఎలా మలుచుకుంటే ఈ భయము అన్నది మనలో ఇలా అలబడుతు వచ్చెనో తెలియరాలేదు. కాబట్టి విషయాలను సరిగ్గా అర్థం చేసుకొని ఆ విషయములో కొంచెంకొంచెంగా నిలద్రొక్కుకుంటు రావుటలో ఆ విషయము పట్ల అలబడిన భయము అన్నది కొంచెంకొంచెంగా తొలుగుతు వచ్చును.

Download PDF Now