మానవాళికం

43.6) కొందరికి ఎక్కువగా తినాలన్న భయము, ఆ భయాన్ని వాళ్ళు ఎలా ఏర్పరుచుకొనియుందురు?

ఒకప్పటి నడకలో ఏది ఎంత తిన్నా చక్కగా జీర్ణించుకొనే వాళ్ళు అని చెప్పేవారు. అప్పుడు వాళ్ళు అనుభవపూర్వకమున అడుగు అడుగు అర్థంలో స్థిరంగా నిలద్రొక్కుకొన్నవాళ్ళు. కావున వాళ్ళ అనుభవస్థిరస్థితిని బట్టి ప్రేవునాడులకు గట్టి సారవంతము అలబడుతు వచ్చును. దానిని బట్టి ప్రేవు దేనినైన కొట్టి పిప్పిచేయును. అలా పూర్తి స్థిరస్థితియే అలబడుతు వచ్చుటలో ప్రేవు రాయిని కూడ పిండికొట్టగలదు కాని ఆ తరువాత మన తోటి అనుభవజ్ఞులు తమ అనుభవలోతుల్లో స్థిరస్థితి కోల్పోతు రావుటలో ప్రేవునాడులలో సారము కోల్పోతు వచ్చును. అప్పుడే ప్రేవునాడులు పిప్పికొట్టలేవు. అలా పిప్పికొట్టలేక పోవుటచే ప్రేవులో అలాగే వుండటము మందగించినట్లు ఆ జీవము దానిని బట్టి కదలలేక పోవడము. అజీర్ణతతో ఆ జీవములు పడే అవసాట్లు పుల్లగా తేపులు రావడము ఆ జీవప్రమాణికములు నిల్వరించుకొనలేక పోవును. ఆ తరువాత అది నిదానంగా జీర్ణం అయ్యి విసర్జనగా బయటికి వస్తే తప్ప ఆ జీవము కొల్కోలేదు. వీటిఅన్నింటికి కారణము ఆ జీవములు తమ అనుభవస్థిరస్థితిలను కోల్పోవడమే. కాబట్టి ఆ అనుభవములను గుర్తు ఎరిగి సరిమల్చలేక ఒకవేళ అలా సరిమల్చినట్లైతే మరళ జీవానుభవసారము పెరుగుటలో ప్రేవునాడులకు కూడ సారము వెలువరింపబడి మరళ పదార్థాన్ని చక్కగా పిప్పికొట్టును. ఒకవేళ సరిమల్చలేకపోయినట్లైతే తిన్న ప్రతిసారి అదే ఇబ్బందిని జీవములు ఎదుర్కొనుటలో ఆ జీవములకు తినాలన్న ముందుకు కదలలేక ఆగిపోయే విధానమున భయము అనే పొర కప్పబడును.

Download PDF Now