మానవాళికం

43.7) కొందరిలో కొన్ని పనులు చేయవలెనంటే ముందుగా భయము కల్గుతు వచ్చును ఎందుకు?

మనమందరము కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులలో ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవించుట యందు ప్రవర్తన నియమావళి అలబడుతు వచ్చెను. అదేవిధంగా ఆ కాలక్రమ కోణపు వివరణలలో పనిక్రమములను కూడ పుట్టించెను ఆ పనిక్రమముల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కావున ఒక్కొక్క పనిక్రమ నడకతో కూడుకోబడిన వివరణలలో కదిలించి జీవింపచేయుట యందు మనకు అనుభవము వెలుబడును. అలా వెలుబడిన అనుభవములలో మన నుంచి ఆ అనుభవాలు బాహ్యానికి వెలుకివచ్చెను. అయితే అలాగే స్థిరస్థితి అయిన అనుభవము అన్నది ప్రతిఒక్క పనిక్రమ తీరులో అలబడుతు వచ్చుటలో ప్రతిఒక్క పనిక్రమ పట్ల ఏకాగ్రత, శ్రద్ధ, పటుత్వము పెరుగుతు వచ్చుటలో ఆ పనిక్రమ అనుభవములు మన నుంచి చక్కగా బాహ్యానికి వెలికివచ్చేవి. అలా పనిక్రమ లోతుల్లో కూడ జీవింపచేస్తు పోవడము జరుగును మనల్ని. కాని ఆలోపే ప్రవర్తన నియమావళి నడకతో కూడుకోబడిన దారులలో స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడేలోపే ఆ దారులను అటుఇటుగా వంకరముగా మలుచుకొనుటలో ఆ స్థిరస్థితి కొంచెం కొంచెంగా కోల్పోతు వస్తాము. కావున ప్రవర్తన రీతిని బట్టియే పనిక్రమము కూడ సాగును. కావున వంకర దారుల అలవరికలో ప్రవర్తననే కోల్పోతు రావుటలో ఆ జీవస్థితి ప్రమాణికములు వంకర అలవరికలో కదులుట యందు ఆ పనిక్రమములు కూడ వంకరముగా చేయును. అలా చేయగా చేయగా ఆ పనిక్రమ నడకు సరిగ్గా చేయలేమో అని తమ పనిక్రమముపైన తామే నమ్మకాన్ని కోల్పోతు రావడము జరుగును. అలా కోల్పోయే కొలది కొంచెంకొంచెంగా ఇప్పటివరుకు ఏర్పడిన ఆ అనుభవ స్థిరస్థితి తగ్గుతు వచ్చును. అప్పుడు ఆ జీవస్థితి కదలలేదు. అలా కదలని విధమున పనిని నిర్వర్తించలేదు. ఒకవేళ నిర్వర్తించిన అది సరినిర్వహణలో సాగదని ఆ జీవానికి వుండుట ద్వార అది నేను సరిగ్గా చేయలేనేమో అన్న విధమునే ఈ భయము అన్న పొర అలబడుతు వచ్చును. ఆరకంగా వాళ్ళు ఏఏ పనిక్రమ నిర్వహణలలో అలా మలుచుకున్నారో వాటి పట్ల వాళ్ళకు భయము కల్గుతునే యుండును.

Download PDF Now