మానవాళికం

43.8) కొందరు ఏవో చేయకపోతే ఏమో జరుగుతుంది అని ఎందుకు భయపడతారు?

మన అనుభవపూర్వక నడక ప్రకారంగా చూస్తే మనకు మనకు ఏమి తలియరాలేదు. కాని మనలో మనకుగా లోకగమనము మన నోటివెంట పలికిస్తేనే మనకు ఏమైన తెలియవచ్చాయి. ఉదా: పండగలు మనకంటే ముందు ఈ నాడీపర్యావరణములో పరిపక్వతాయుత దశస్థితి చేరుకున్న దైవాంశస్వరూపాలు వాళ్ళు సాధించేతనమున వాళ్ళ ప్రసారములు కాలగర్భ నిర్వహణలో నిల్వరింపబడియుండును. అవియే మనము చెప్పుకునే వినాయకచవితి అని, శ్రీరామనవమి అని పండుగలు. కాబట్టి కాలము నిర్ణయించిన ప్రకారంగా పలాన రోజు అని ఆ పండగ సందర్భ గడియ ప్రసారములు పై బాహ్యపుపొరల లోనికి వెలుబడును. ఆ రోజునే పండుగ రోజు అనెదము. అదికూడ మనలో మనకుగా లోకగమనము తెలియచెబితేనే అది పలాన పండుగ అని మన నోటివెంట వెలుబడును. అలాగే ఆ పండుగలు ఎలా చేయాలి అన్నది కూడ ఆ లోకగమన నడక ద్వారానే మనకు తెలియచెప్పడం జరిగెను. కావున ఆ పండుగ సందర్భంన మన లోకమునకు వచ్చిన కొత్త ప్రసారములను పట్టి ఉత్తేజితపడమని ఆ ప్రసారములు వెలువరింపబడును. అంతేకాని ఆ పండుగ చేస్తే ఏమైతుందో ఒకవేళ చేయకపోతే ఏమో అవుతుంది అన్నది కాదు. చెప్పాలంటే మనము ఆ పండుగ సందర్భ ప్రసారములచే మనకు ఉత్తేజితపడుటకే కాని వాళ్ళకు పండుగను చేసేటంత వాళ్ళము మనము కాదు. ప్రకృతితుల్యంలోనే ప్రసార ప్రభావితములను బట్టి వికశింపులు వచ్చును. అప్పుడే ప్రకృతి శోభాయమానంగా కదులును. కాబట్టి ఆ పండుగ అన్నది మన లోకానికి. కాబట్టి లోకములో వెలుబడే పండుగ ప్రసారములను మనము అందుకోవలె. అంతేకాని మన ఇంట చేసుకోలేదని ఎలా అని ఆలోచన వలదు. ఒకవేళ చేయకపోతే ఏమో అవుతుంది అన్నది కానేకాదు. మనము చూస్తే పండుగను చేయకపోవుటలోనే మనకు ఏమి జరిగినా అందుకుగానే జరిగాయి అని తలంచుతాము. కాని మనకు మన అనుభవస్థితిగతులను బట్టి ఏమైన జరుగుతాయి కాని పండుగ చేయకపోవుట ద్వార కాదు. అది గుర్తు ఎరిగినట్లైతే మన అనుభవాల్ని గుర్తు ఎరిగి సరిమలుస్తు పోవుటలో మనకు ఏమియు జరుగవు. అప్పుడు మనము వాటిపైన, వీటిపైన పెట్టవలసిన అవసరము యుండదు. అప్పుడు ప్రస్తుత ఇప్పటివరుకు ఏర్పడిన భయము అనే పొర కూడ కొంచెంకొంచెంగా తొలుగుతు వచ్చును.

Download PDF Now