మానవాళికం

49.) కుటుంభ సమస్యలకు కారణములు ఏమి?

మొదలుగా సమస్య అన్నది ఎందుకు వచ్చును అనగా మనయొక్క అనుభవపూర్వక పరనడుమున చిన్నచిన్న లోపాలను గుర్తు ఎరుకపరచడానికి మరియు కొత్త కోణాలు గుర్తింపచేయుటకు గాను సమస్యలు మొదలయ్యెను.కావున సమస్య పుట్టుకరాబడుటలోనే దాని యొక్క పరిష్కారము కూడ ప్రక్కనే వుండును.కావున సమస్యలు అన్నవే లేనియెడల మనయొక్క అనుభవములో మనము ఎక్కడ వున్నామో తెలియరావుటకే లేదు కాబట్టి మనయొక్క అనుభవపూర్వక వెలికితీత పరనడుమున జీవస్థితి యొక్క ప్రమాణికములు తమ అనుభవంలో తాము స్థిరంగా నిలద్రొక్కుకొనుటకు ఈ సమస్యలు తోడ్పడును.ఒక సమస్య మనకు ఎన్నో మెలుకువలు నేర్పును,మనలో మనకే తెలియని ఎన్నో అనుభవ లోతులు మనయందు దాగియున్నవి కాబట్టి ప్రతి సమస్యకు వెతుకులాడే దారులలో మనలోనున్న మనయొక్క అనుభవము మనకు తెలియవచ్చును.కాబట్టి సమస్యకు తట్టుకోని నిలబడవలె అంటాము.ఒక సమస్యను మనయొక్క అనుభవపూర్వకముతో పరిష్కరించుకొన్న యెడల ఎలాపోతే సమస్యలు ఎదురు అవుతాయో తెలియవచ్చును. కావున పడిన విధానంలో మెలుకువ యందే వుండెదము,ఎందుకంటే కోరికోరి సమస్యను కొనితెచ్చుకొము కదా.అదినూ ఒక కుటుంభ వ్యవాహరికములో సమస్య వచ్చినట్లైతే ఒకరికొకరుగా అర్థం చేసుకొని దాని పరిష్కరించుకోవడంలో ఒకరిపైన ఒకరికి ఎంతటి అర్థము అవగాహనలు ఏర్పడ్డాయో మరియు సర్డుపాటుతనాలు మరియు పంచుకోవడాలు కావున ఒక సమస్య దగ్గరికి చేర్చగల్గును,మనషులను దూరము చేయగల్గును ఆ దగ్గరిదూరతనాల నడుమున ఒకరికొకరిని పూర్తి అర్థం చేసుకొనుటకు అవకాశము వచ్చును.కాబట్టి సమస్యలు అన్నవి మనయొక్క అనుభవ స్థితిగతులలో నిలద్రొక్కుకొనుటకే కాల నిర్వహణలో పుట్టుకొచ్చెను.కాబట్టి ఒక సమస్యను ఎదురుకొన్నట్లైతే మనయొక్క అనుభవముపై మనకు నమ్మకము కల్గును.

Download PDF Now