50.) ఒత్తిడి అంటే ఏమిటి.దానిని అధికమించడం ఎలా?
అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి యందు నుంచి ఆ కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు నాల్గు వయస్సుప్రమాణికమున జీవిస్తు రావుట యందు ఆయా కాలక్రమదారులలో మొదలు అనుభవము వెలుబడెను.మరల తమ అనుభవములో జీవించబడుతు అనుభవపూర్వక పరనడుమున ఒక్కొక్క దారి అలవరికలో స్థిరస్థితి పొందవలె.ఉదా:-దారులు అనగా కోణపులోతుల దారులు.ఒక్కొక్క కోణపు తీగఅల్లిక లోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికములు జీవించడం అన్నది జరుగుటలో స్త్రీ కోణము అయినట్లైతే స్త్రీజీవముగా,అలా తల్లికోణము,బిడ్డకోణము ఏఏ కోణవివరణలకు తగ్గట్టుగా జీవ ప్రమాణికములు జీవించుట యందు వెలుబడే అనుభవంలో తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికము నిలద్రొక్కుకోలేని యెడల వినే వినికిడి,చూసే చూపు,మాట్లాడే మాట,చేత,నడక అంతయు ఆ తీగ నిర్వహణలో జీవప్రమాణికము కదిలే విధానమును బట్టి ఆధారపడి యుండును.కావున జీవస్థితి ప్రమాణికములు తీగఅల్లికతో కూడుకోబడిన దారిలో అటుఇటుగా ఊగిసలాడిన,తొనికిసలాడిన ఆ దారిలో ముందుకు కదలలేక పోవుటలో మొదలుగా ఒత్తిడి అన్నది మొదలయ్యెను.ఎందుకంటే జీవస్థితి యొక్క ప్రమాణికము అక్కడక్కడే కదులును కావున తరువాత నాల్గు కోణాలు కలిసి ఒక వివరణాయుత విషయఅల్లికతో కూడుకోబడిన దారి అవుటలో నాల్గు పాత్రపోషణలు ఆ స్థూల తొడుగులోనే కదులుట యందు విషయము పట్ల సరియైన అర్థ అవగాహన పూర్తిగా ఏర్పడక పోవుట ద్వారా విషయ నిర్వహణ పట్ల ఒత్తిడి మొదలయ్యెను.మనయొక్క అందరి ప్రయాణము గతస్థితిని బట్టి ప్రస్తుతస్థితిలో సాగుతు వుండుట ద్వారా గత నిర్వహణలో ఎలా తెచ్చుకుంటే మనయొక్క జీవితము ఇలా సాగుతున్నదో తెలియకపోవుటచేత కొంచెం కొంచెంగా ఒత్తిడి పెరుగుతు పోవును.చేసే పనిక్రమ నిర్వహణ యందు ఏకాగ్రత,శ్రద్ధ, పట్టుత్వాలు లోపించిన ఆ పనిక్రమము ఏమవుతుందోనన్న ఒత్తిడి పెరుగును,ఇక ఒకొక్కరి మనస్థత్వ కారణంగా ఒకరిది ఒకరికి వెనువెంటనే అర్థం కాకపోవుట ద్వారా ఒత్తిడి పెరుగును ఒత్తిడి అనగా అది ఒక పొరప్రభావము.జీవస్థితి యొక్క ప్రమాణికముపై పడును. జీవస్థితి ప్రమాణికములు తీగఅల్లికతో కూడుకోబడిన వివరణ యెడల అనుభవ స్థిరస్థితిలో నిలద్రొక్కుకొన్నట్లైతే ఒత్తిడి పొరప్రభావము అలబడదు.ఎందుచేతననగా జీవస్థితి ప్రమాణికము తమ అనుభవములో స్థిరస్థితిగా నిలద్రొక్కుకొని ప్రతిది అర్థ అవగాహనలో ప్రయాణించును కావున లేనియెడల ఆ ఒత్తిడి జీవస్థితిపై పొరప్రభావము ఎప్పుడు కప్పునో జీవానుభవసారము తరుగుదల అవుతు పోవును.దాని ప్రభావము ప్రథమనాడి,పిల్లనాడి, నర్వులు,నాళాలకు అలబడుటలో లోపలిభాగాలు,పైభాగాలు కూడ ఒత్తిడిలోనై నిస్సత్తువ వచ్చును,నిదానంగా పనిచేయకుండానే పోవును.