51) అందరము ఎవరి మనస్సులో వాళ్ళు వున్నాము,కాని మనస్సు అంటే ఏమిటి?
మనమందరము వున్నది స్థూల అనుభవములో కావున స్థూలవివరణల నడుమున మనయొక్క జీవితకాలాల ప్రయాణము సాగనున్నది.కావున జీవప్రమాణికములు అన్నియు జీవించునది ఒక స్థూలతొడుగులో కాబట్టి జీవ అనుభవాన్ని బట్టి లోపలిభాగాలు అయిన పైభాగాలు అయిన స్థూలవివరణలకు తగ్గట్టుగా ప్రకృతియే కదిలించవలె.కాబట్టి ప్రకృతి మొదలు ప్రథమనాడిలోని కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా శబ్దము ఆధారంగా జీవప్రమాణికమును కదిలించగా కదిలించగా జీవించుటలో వెలుబడే జీవ అనుభవాన్ని ముఖస్థుతి యందు హావముగా మెడవంపులు,చేతులు,కాళ్ళ అమరికలు కదిలే విధానమును హావభంగిమ కానవచ్చునట్లు చూపునది మనస్సు అద్దము కావున స్థూలతొడుగు లోపలి విభాగము నుంచి పైకి మనిషిగా మనస్సు నడకగానే తయారగును.కాబట్టి మనస్సు పుట్టుకకు కారణమైన ఒక ప్రాకృతికమండలము అది కాలగర్భంలోనే నిల్వరింపబడి అందునుంచి ఒక ప్రకృతి యొక్క అణువు బాహ్యప్రసారాల నడుమున జీవానుభవములలో వెలుబడిన బాహ్యపు దారులలో అదినూ ఒక స్థూలతొడుగు అనుసారికములోనే ప్రకృతి యొక్క అణువు వెలుబడును దానిపేరే మనస్సు.కాబట్టి ఆ ప్రకృతి అణువు నుంచి పొర వెలువరింపబడుటలో ఆ దారులు మనస్సు దారులుగా మలువబడును.కాబట్టి ఆ మనస్సు దారులలోనే ఈ స్థూలతొడుగు మనిషిగా తయారుకానున్నది కావున మనస్సు అన్నది ఒక ప్రకృతి యొక్క అణువు.