మానవాళికం

54.) నాలో నేను ఏమి కోల్పోయాను?

మనలో మనకు తెలియని మనయొక్క అనుభవము దాగియున్నది.అదినూ నాల్గు వయస్సుల అనుభవము.బాల్యము,యుక్తము,కౌమారము,వృద్ధాప్యము అలా వయస్సుకు తగ్గట్టుగా పాత్రపోషణలలో జీవించుట యందు అనుభవము వెలుబడెను.స్త్రీ,పురుష,భార్య, భర్త,తల్లి,తండ్రి,సోదరి,సోదరుడు ఇలా ఒక్కొక్క పాత్రపోషణ యందు లోతులు వెలుబడుతు పోవుటలో ఒక్కొక్క పాత్రపోషణల యెడల ప్రవర్తన,వ్యక్తిత్వము,గుర్తింపు,విలువలు పెరుగుతు పోయెను.అదేవిధంగా పనిక్రమ నిర్వహణలలో కూడ నాలోని జీవస్థితి ప్రమాణిక ములు జీవింపచేస్తు రావుటలో పనిక్రమ నిర్వహణ లోతుల్లో అనుభవము వెలుబడుతు పోయెను.ఇలా అన్ని కాలక్రమదారులలో జీవించబడుతు రావుటలో వెలుబడిన అనుభవములు.మన అనుభవములో మనము నిలద్రొక్కుకొనలేక ఎన్నోసార్లు చచ్చి పుట్టాము.కావున సరియైన అనుభవము రాకపోగా మరల గడిచిన కాలక్రమదారులలోనే మరల మరల నాల్గు వయస్సు ప్రమాణికమున జీవిస్తూనే వున్నాము.కాని ఇంతవరకు మనకు ఎంతటి అనుభవ లోతులు ఏర్పడబడ్డాయో తెలియక ఉన్న అనుభవాల్ని కోల్పోతున్నామో లేక అనుభవాల్ని పెంపొందించుకున్నామో మనకే తెలియలేదు.కావున మన అనుభవపూర్వక లోతుల స్థితిగతులు అన్నియు మనయొక్క గమనములోనికి వస్తే తప్ప మనము ఎంత అనుభవజ్ఞులమో తెలియుదు కాబట్టి మొదలు నాయొక్క అనుభవపూర్వక పరనడుమున నేనే ఎక్కడ వున్నానో నాకు తెలియరావలె.అప్పుడే వున్న అనుభవాల్ని నిలబెట్టుకొనుటలో మనయొక్క ప్రవర్తనను,వ్యక్తిత్వాన్ని,గుర్తింపును, విలువలను కోల్పోకుండా మనల్ని మనము నిలబెట్టుకోగలము.మనము బాహ్యంలో చెప్పుకునే తిండి,తీర్థము,భత్యము, గూడు,గుడ్డ,ఆస్థి పాస్థి ఇవి అన్నియు మనయొక్క అనుభవసారములో నుంచి మనయొక్క పేరుబలాల నడుమున కాలగర్భం నుంచి పుట్టుకొచ్చి కాలానుసారము నుంచి వెలువరింప బడినేవి.ఇప్పుడు మనయొక్క అనుభవాల్ని కోల్పోతే మనము అనుభవించి సంతృప్తి చెందకమునుపే వాటిని కోల్పోవలసి వచ్చును.కావున వేటినైన మనయొక్క అనుభవమే నిలబెట్టును.కాబట్టి ప్రస్తుత మనమందరము రకరకాల సమస్యలలో మునిగి తెలుతున్నాము అన్నా మనయొక్క అనుభవాల్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మలుచు కోవడంలోనే ప్రతిఒక్కరము ఒకరకంగా మానషికంగా శారీరకంగా పడుతూనే వున్నాము. కాబట్టి మనము మనయొక్క అనుభవాల్ని కోల్పోతున్నాము.

Download PDF Now