మానవాళికం

58) భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటి?

మనకు ఒక స్థూలతొడుగు యందే ఎడమవైపు స్త్రీ నాడీమండలము కుడివైపు పురుష నాడీ మండలములు అలవరచడము జరిగెను.అలా చూస్తే స్త్రీ పురుష అనుభవ నిర్వహణలో ఈ స్థూలతొడుగు మొదటి పుట్టిగిట్టుటలో ఒక స్త్రీ నాడీమండలపు లింకులలో స్త్రీ బాల్యము ఆ బాల్య నిర్వహణ యందు తల్లి,తండ్రి,తాత,అవ్వ,జేజి,అబ్బ,పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అయిన అక్క అన్నలు అదేవిధంగా చిన్నాన్న చిన్నమ్మ ఇలా బాల్యక్రమములో బాల్య జీవములు అనగా అవి బాల్యకణాలు ఒక్కొక్క కణనిర్వహణ యందు ఇంత జీవప్రమాణికము అని అమర్చడం జరుగుటలో ఆ జీవనిర్వహణల పాత్రపోషణలలో బాల్యజీవములను జీవింపచేయడం జరుగును.అలా బాల్యానుభవపూర్వక పరనడుమున వాళ్ళతో జీవించుట యందు బాల్యము పూర్తి అయ్యి యుక్తప్రసారములలోనికి వచ్చెదము. అప్పుడు ఒక స్థూలతొడుగు స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా,పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా స్త్రీ పురుష తొడుగులు తయారగును.అలా ప్రకృతితుల్యంలో స్త్రీ పురుషులు ఏకం అన్నటుల ఆ రెండు జీవాలు ఒక జీవము ఒక జీవము జీవించుటలో వాళ్ళ ఇరువురి కలయికలో స్త్రీ పురుష వికసింపుల నడుమున ఇరువురి శేషస్థితి భాగాలు ఏకనిర్వహణలో తొడుగులు బాహ్యానికి ఏకం చేయునదే ప్రకృతి.అలా స్త్రీ పురుష జీవాలు జీవించుట యందే ఆ వికసింపుల నడుమున స్థూల రసస్థితిద్రావకాల విచ్చుదలలో పిండములోని బుడగ విచ్చుదలకు రావుటలోనే సృష్టికి పునర్ సృష్టి అన్నటుల మరియొక స్థూలతొడుగు తయారిదాయకము అగును.అలా స్త్రీ పురుష స్థూల రసద్రావకాలలోనే పిండము యొక్క విచ్చుదల వచ్చును అని అనుటలో స్త్రీ పురుష ఒక జీవముతో ఒక జీవము తోడునీడై ఇరువురు ఏకం అయ్యి ఒక జీవము వుంటే ఇంకొక జీవము జీవిస్తుంది అన్నటుల ఒక జీవములేనిదే ఇంకొక జీవము జీవించలేదు అన్నటుల చక్కటి అల్లికల నడుమున కూర్చిన భార్యాభర్తల సంభందాలు.భ అనే ఈ పదనడకలు భవభందాల అతీత నిర్వహణలో బంధము అనుట యందు మొదటి ఈ రెండు జీవాలు జీవిస్తేనే బంధము అన్నది అలబడును మరియు ఇంకొక బంధ పుట్టుకకు కారణమగును. కాబట్టి స్త్రీ పురుష తీగల అల్లికలలోనే మిగిత తీగలు పుట్టుకొచ్చును.వాటినే సత్సంబంధ బాందవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగలు అనెదము.కావున బాహ్యము అనుట యందు ఇది సంపూర్ణ అర్థము మాత్రమే.అందుచేతనే భార్య,భర్త అనునవి నాడీమండలాలు.ఆ మండలాల యందు భార్యకణాలు,భర్తకణాలలో ఒక్కొక్క వివరణ నడకలో ఆ జీవస్థితి ప్రమాణికములను జీవింపచేయుటలో అనుభవము వెలుబడే విధానము యందే అవి భార్యాభర్తల సంభందిత విషయాలు తేల్చబడెను.కావున ఆ కోణపు వివరణలలోనే భార్యజీవము భర్తకు,భర్తజీవము భార్యకు అర్థం అయ్యి ఒకరితో ఒకరు అన్నటుల జీవించడము జరుగును.కాని ప్రస్తుత ఇప్పటివరకు చచ్చిపుట్టి ఒకమారు స్త్రీగా ఒకమారు పురుషునిగా ఈ భార్యాభర్తల పాత్రపోషణలలో కోణపులోతు వివరణలకు తగ్గట్టుగా జీవించుట యందు ఎప్పటి అనుభవలోతులు అన్నవి ఏర్పడినవో ఆ లోతులకు తగ్గట్టుగా అర్థచింతనతో జీవిస్తున్నామో తెలియరావలెనన్నా గతగతస్థితిల మన అనుభవపూర్వక నడక గమనానికి అందరావలె. అప్పుడే మన అనుభవములో మనము జీవించుట యందు పూర్తి జీవిత సంతృప్తిని పొందెదము ఒకరితో ఒకరము.

Download PDF Now