స్థూల వివరణ

112.) రాయిపైన రాయి పడితేనే శబ్దము అన్నది వెలువరింపబడునా ఎందుకు గాన?

sthoolavivarana

బాహ్యపుపొరలపైన నిల్వరింపబడిన శబ్దపుపొరలలో ఏ శబ్దానికి ఆ శబ్దమే అన్నటుల శబ్దాలను నిల్వరింపచేయును ఆ శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కావున రాయి శబ్దమే తీసుకొన్నట్లయితే ఆ శబ్దము శబ్దపుపొరలో నిల్వరింపబడియుండును. కావున రాయిపైన రాయి పడితేనే ఆ శబ్దము పల్కును లేని యెడల పలుకబడదు. కాబట్టి దేని శబ్దము దానికే వర్తించునట్లు అమర్చింపచేసెను ఆ శబ్దముల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. ఎందుచేతననగా అవి రకరకాల స్థూలరసద్రావకాల నిష్పత్తులు కాబడుట ద్వారా కాబట్టి ఒక్కొక్క రసస్థితి ద్రావకమునకు గాన ఒకరక శబ్దమును వెలువరింపచేసెను. కాబట్టి రసస్థితి ద్రావక నిర్వహణలోనే ఆ శబ్దములు పల్కును.