స్థూల వివరణ

114.) పెద్దరాయిపైన చిన్నరాయి పడుటలో చిన్నశబ్దమే వెలువరింపబడునా లేక పెద్దశబ్దము వెలువరింపబడునా అది ఏరకంగా?

sthoolavivarana

పెద్దరాయి అని అనుటలో స్థూలరసద్రావకాల నిష్పత్తులు ఎక్కువ శాత నిర్వహణలో వెలువరించి ఆ ద్రావకాలను మిళితం చేయుటలో అవి గట్టుపడి రాతిగా నిర్మాణము అగును. కావున ద్రావకాలను ఎక్కువ శాతములో వెలువరించే కొలది భూతెరల నుంచి రాయి పెరుగుతు వచ్చును. అలా చిన్నరాయి నుంచి పెద్దరాయిగా తయారు అగుటలో అందున శబ్దము కూడ స్థూలరసద్రావకాల శాతపరిధిలను బట్టి శబ్దము కూడ పెరుగుతు వచ్చును. కాబట్టి రాయి పెరిగేకొలది రాయి అంత శబ్దము ఆ రాతిలోనే నిల్వరింపబడియుండును. కావున ఆరకంగా పెరిగిన పెద్దరాయిపైన అదే స్థూలరసద్రావకాల మిళితంతో చిన్నరాయి తయారు అగుటలో చిన్నరాయి మేర శబ్దం ఆ చిన్నరాయిలోనే నిల్వరింపబడి యుండును. కావున పెద్దరాయిపైన చిన్నరాయి పడినట్లైతే చిన్నరాయి మేర మాత్రమే పెద్దరాతిలో శబ్దం పల్కును. అంతేగాని పెద్దరాతిలో వున్న శబ్దము అంతయు పలుకబడదు.