స్థూల వివరణ

119.) నీళ్లు అన్నవి అడుగుల లోతుల్లో పెరుగుతు పోయేకొలది శబ్దాలు మారుతు పోవునా లేక ఒకేరక రీతిలో యుండునా?

sthoolavivarana

నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వయుండును. మరి నీళ్ళను పుట్టించడం అంటే అన్ని నీళ్ళు ఒకటేరీతి లేక అడుగు అడుగుకు నీటిఅలవరిక ద్రావకాల నిష్పత్తులు మారునా అన్నది తెలియరావలె. ఎందుచేతననగా ఆ నీళ్ళను ఒక్కొక్క కాలక్రమదారులను బట్టి పుట్టించడం జరుగును. ఒకటవ కాలక్రామదారులు అని అనుటలో అవి మొదటి కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. కావున ఆ మొదటి కోణపుతీగలు అన్నవి ఏ స్థూలరసద్రావకాలతో నిర్మితం చేయడం అన్నది జరిగెనో ఆ ద్రావకాలనే ఆ ప్రాకృతికమండలం మొదట పుట్టించి వాటిని నీళ్ళుగా అలవరుస్తు వచ్చును. కాబట్టి ఒకటవ అడుగులో నిల్వరింపబడిన నీళ్ళు అన్నవి మొదటి కోణపులోతు వివరణల నడుమున పుట్టించినవి. కావున ఆ నీళ్ళ శబ్దాలు అన్నవి ఒకరకంగా యుండును. కాబట్టి ఆ శాబ్దాలను బట్టి ప్రకృతి యొక్క అణువులు ఆ ఒకటవ అడుగులోనే నిల్వరింపబడును. ఆ తరువాత ఆ ఒకటవ అడుగుపైన రెండవ అడుగు నీటి మట్టము నిల్వరింపబడును.ఆ నీళ్ళను ప్రాకృతికమండలము రెండవ కోణపుతీగల అల్లికల రసద్రావకాలను పుట్టించి రెండవ అడుగు నీళ్ళుగా వెలువరింపచేయును. కావున ఆ నీళ్ళ శబ్దాలు వేరుగా యుండును.కాబట్టి ఆ శబ్దాలను పట్టిన ప్రకృతి యొక్క అణువులు ఆ రెండవ అడుగులోనే నిల్వరింపబడియుండును. కాబట్టి అడుగు అడుగు నీటి లోతుల్లో శబ్దాలు అన్నవి మారుతూనే పోవును.