స్థూల వివరణ

146.) గాలి అన్నది ఆగునా? అలా ఆగితే శబ్దం కూడ ఆగునా?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో ఆ లోతులు అన్నది ఒక్కొక్క అడుగు పెరుగుతు పోతేనే లోతు అన్నది ఏర్పడును. కాబట్టి ఒక్కొక్క అడుగు అన్నవి కోణపులోతుల్లో అలబడినేవి. ఉదా:- స్త్రీ కోణాలుయే తీసుకున్నట్లైతే ఒకటవ అడుగుకు గాన ఒకటవ కోణపుతీగ అల్లిక, రెండవ అడుగుకు గాన రెండవ కోణపుతీగ అల్లిక అలా స్త్రీ పదమునకు సంపూర్ణ అర్థమును సంతరింపచేయుటకు గాన స్త్రీ కోణాలు ఎన్ని వున్నవో అన్ని అడుగుల లోతు ఏర్పడును. అదేవిధంగా పురుష, తల్లి, తండ్రి ఇలా ప్రతి పదానికి అర్థం అడుగుల లోతుల్లో కోణపుతీగల అల్లికలలో నిల్వరింపబడియుండును. కాబట్టి ఆ అడుగు అడుగుకు గాలి అణువును ఆ గాలి అణువులో శబ్దపు అణువును నిల్వరింపచేయడం జరుగును. అడుగు అడుగు కదులుటలో గాలి, గాలితో పాటు శబ్దము ఏకం అయ్యి రెండవ అడుగులోని గాలిని శబ్దాన్ని ఏకం చేసుకొని కదులుతు పోవును. అలాకాక ఏ అడుగులోనైన కోణపుతీగ అల్లిక కదలని యెడల గాలి గాలితో పాటు శబ్దము ఆ అడుగులో ఆగిపోవును. ఒకవేళ ఆ కోణపుతీగ కొంచెంగా కదులుతున్న అక్కడక్కడే గాలి గాలితో పాటు శబ్దము అక్కడక్కడే కదులును. ఒకవేళ పూర్తిగా ఆగిపోయినట్లైతే గాలి గాలితో పాటు శబ్దం కూడ ఆగి ఆ అడుగులోనే నిల్వరింపబడియుండును.