స్థూల వివరణ

156.) గాలి, వాన రెండును ఒక్కసారిగా ఎందుకు వెలుబడును? ఆ రెండిటి శబ్దాలు ఒకదానిలో ఒకటి ఏకం అగునా?

sthoolavivarana

మన మనస్సుదారులు అని అనుటలో అవి కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. కావున కాలక్రమములు పెరుగుతు పోయేకొలది కోణపుతీగల అల్లికల వివరణలుకూడ మారుతు పోవును. కాబట్టి నాల్గు కోణాలను కలుపుతు ఒక వివరణాయుత విషయఅల్లికతో కూడుకోబడిన దారిగ కదిలించడం జరుగును. అదేవిధంగా విషయానికి తగ్గట్టుగా ఖచ్చిత పొరప్రభావితములు అనగా మంచి, చెడు, కష్టము, సుఖము, అపద్దం, నిజము, స్వార్థము, నిస్వార్థము ఇలా వీటిని విషయానికి తగ్గట్టుగా ఖచ్చిత పొరప్రభావిత శాతపరిధిలలోనే అలవరిచి జీవస్థితి ప్రామాణికములను కదిలించి జీవింపచేయడం జరుగును. కాబట్టి ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికల వివరణలు పెరుగుతు మారుతు పోవుటలో ఈ పొరప్రభావిత శాతపరిధిలను కూడ పెంచుతు కదిలించి జీవింపచేయుటలో మంచిలోతు, చెడులోతులు అన్నవి ఏర్పడుతు పోయెను. ఆ లోతుల్లో స్థిరస్థితి అయిన అనుభవమే వెలుబడినట్లైతే కష్టాన్ని సవిచూచేవాళ్ళము. అదేవిధంగా సుఖాన్ని సవిచూచి అందులో స్థిరంగా నిలద్రొక్కుకొన్నట్లైతే రెండును అనుభవాలే అని తెలియవచ్చేవి. కాని ఆ అనుభవములలో స్థిరంగా నిలద్రొక్కుకొనలేక ఎక్కువ తక్కువ మలుచుకొని అనుభవించాము. కాబట్టి కష్టమైతే పడలేమని సుఖము అయితే బాగుంటుందని మనము తీసుకొన్న విధానములో ద్వంద్వం మొదలయ్యెను. కష్టము వెంటనే సుఖము వుంటుంది, సుఖము వెంటనే కష్టము వుంటుంది అన్నటుల ద్వంద్వం మన మనస్సు లోతుల్లో ఎప్పుడైతే ప్రవేశపెట్టడం అన్నది జరిగెనో ఆ ద్వందపూరిత ప్రకారంగానే బాహ్యానికి ప్రదర్శించుటలో ఆ బాహ్యనుభవలోతుల్లో కూడ ప్రసారములు కూడ ద్వందపూరితంగానే కదులుటలో గాలి మరియు వాన అన్నటుల అయిన మొదలగును (లేక) వాన మొదలగుటలో వాన మధ్యలో గాలి అయిన వెలువరింపబడును. కాబట్టి వర్షపు చినుకులలో వెలుబడే శబ్దాలు, గాలిలో వెలుబడే శబ్దాలు ఒకసారి ఏకం అయ్యి కదులును. మరొకమారు వేటికివాటికిగా కదులును.