విద్యా విషయాలు

11.2)బాహ్య గందరగోళము :
External confusion

బాహ్య అనుభవంలో అనుభవాన్ని అనుభవింపగా అనుభవింపగా అనుభవము వెలువడుటలో అనుభవంలో ఏమి తెలియని వారు కొందరు,అనుభవలోతులు ఏర్పడిన వారు మరికొందరు, మద్యస్తులు కొందరు ఉన్నారు.కావున మనకు మనకుగా మనలోపలనుండే మనకి సమాధానం వెలువడకపోతే తోటి మనుష్యులని అడిగితే వారికి తెలిసినమేర చెప్పబడవచ్చును.అది సరియైన వివరణతో కూడుకోబడిన దారి కావచ్చు కాకపోవచ్చు.అది సరివివరణతో కూడుకోబడిన దారి కాకపోతే పడిలేచుటలో దారిమార్గాలు గుర్తు ఎరగవలె.అలా కాక ఎన్నిసార్లు పడుతున్నా దారి మార్గం కానరాక పోవడం,అప్పుడు ఎవరు చెప్పిన వినలేని స్థితికి వచ్చెదము.ఇతరులపై నమ్మకము కోల్పోవడము కాకుండ మనకు మనకుగా సరివివరణతో కూడుకోబడిన దారి ఏర్పడలేదు కాబట్టి నాపైనాకుగా నమ్మకము ఏర్పడబడదు.మనం బాహ్యలోకంలో ఉంటూ మన అనుభవంలో మనం చేసుకున్న వాటికిఅనుభవించుటలో ధైవాలు అనేవారు అవి పోగొడ్తారు అనుకోవడం పొరపాటు.వారిని పూజించుట ద్వారా మన మనస్సు మార్పుచెందవలె గాని అప్పుడే మనం ఏవి ఎందుకు అనుభవింస్తున్నామొ,ఆ అనుభవించటానికై ఓర్పు,సహనం రావలె.అలాకాని పక్షమున తెచ్చుకున్న ఋణభారములను సంపూర్ణంగా తీర్చుకోలేము.మళ్ళీ తెలిసితెలియని విధంచేత తోటి మనుష్యులతో తిరిగి ఋణగ్రస్తులుగాతేలబడటము జరుగును.ఇవి అన్నీ ఇలా వుంటే మనస్సులను సరిమల్చుకోలేక అంతర్య నిర్వహణ పరనడమున సాగే రామాయణం,భాగవతం,వేదాలు,శాస్త్రాలు,ఉపనిషత్తులు ఇవన్ని ప్రకృతి యొక్క శబ్దతరంగాలలో ఎక్కడ పుట్టుకొచ్చాయో తెలియకోకుండా వాటిని పట్టి కూర్చున్నా మన దారి మనకు కానరాదు.ఇంకా మనము అనుభవనిర్వహణ యొక్క పరనడమున నోటి యొక్క పదజాలాల అల్లికలతోకూడుకోబడిన వాక్యానుసారము మాత్రమే వెలుబడుతున్నాయి.ఇంకను కూర్పు,కుదూర్పు నడకలోనే ఉన్నాము.కావున అనుభవంలో 90 అడుగులు లోతులో ప్రయాణం చేస్తే తప్ప అవి కొంచెంకొంచెంగా అర్థం అవుతు పోవును.అలా మన స్థితి పెంపొందించుకుంటూ అవి ఎలా ఏర్పడ్డాయో శబ్దతరంగాలలోగుర్తు ఎరుగుతూపోవలె.కాని అలా గుర్తుకు ఎరగకనే వాటిని పూర్తిగా లోపలికి విశదీకరించలేము.కావునమొదట మన అనుభవంలో ఎక్కడున్నామో తేలవలె.మన లోతు,విస్తారత ఎంతనో,ఇంతవరకు ఎన్ని శబ్దములు,శబ్దధ్వని,శబ్దతరంగాలలో ప్రయాణంచేశామొ,సదృశ్యాలు మనయొక్క నల్లగ్రుడ్డు పొరలలో పడ్డాయో,ఎంతటి అనుభవపూర్వకమైన మాటలు మన నోట్లోనుంచి వెలువడున్నాయొ మనకు మనకే తెలియకుంటే వాటిని ఎలా విశదీకరించడము.ఇంకా మరి కొందరు జీవుడిని ఆత్మాయణస్వరూపమని అంటున్నారు.కాని మనము తెరరంఘ ప్రదర్శన పరనడమున పాత్రపోషణలో,తల్లి జీవప్రమాణికము,తండ్రి జీవప్రమాణికములో వున్నాము.తల్లికి సంపూర్ణ అర్థం వెలువడితే తప్ప జీవోదయకదలికగా ఏర్పడబడదు.అలా అన్ని జీవోదయకదలికల పరనడమున అంతరాలు ఏర్పడితే తప్ప జీవత్వం జీవుడుగా పరిగణలోకి రాదు.ఆ తదుపరియే సూక్ష్మఆకారిత జీవి,సూక్ష్మజీవి,ఎరుకజీవి అనుటలో 72 వేల నాడులు జీవనాడులుగా మారుట యందు మొదట జీవాత్మగా మారును.ఇంకా మరికొందరు ఎన్నోపుస్తకపఠనములు చదివి వాళ్ళు ఏ స్థితిలోవుండి అవి రచించినారో తెలియక అవి చదువుతూనే ఆచరనకు రావు అని తెలియక మనం ఆ స్థితిలోకి పోతేనే అర్థం అవుతాయి అని తెలియకపోవడం.ద్యానం అంటే మనం మనముగా ద్యానించుకోవడం అంటే నెమరువేసుకోవడం అని తెలియక మనస్సులో ఎటువైపుగా దారి కదిలి ఆ దారిలో శ్వాస ఆధారితంగా మానవయంత్రాంగంలోని జీవప్రమాణికము కదులుతుందో గుర్తు ఎరుగకపొతే అస్సలు గమనపూర్వకమైన ప్రయాణము ఎలా సాగును. అక్కడక్కడ అనుభవలోతులు ఏర్పడబడిన,ఆ లోతు ఏ అనుభవంతో కూడుకోబడి ఏర్పడిందోతెలియకపోతే అనుభవంలో గమనం ఏర్పడలేదని,కావున మనపై మనకు గమనము ఏర్పడితే తప్ప మనస్సు అద్దంలోనికి ప్రయాణికం చేయలేము.అస్సలు మనషిగా మనస్సులోనే ఎక్కడ ఉన్నామో తెలియకపోతే ఎటువైపు అని ప్రయాణించెదము.కాబట్టి ఇన్ని బాహ్య గందరగోళాల పరనడుమున మనము అంటే ఏమిటా అని మరచి ఆడుతున్నాము.

Download PDF Now