విద్యా విషయాలు

13.స్థూల అనుభవ వెలికితీత :

మనస్సు,మానవయంత్రాంగం రెండును స్థూలకథల యందు నిర్మితము కాబడిన తరువాత తెరరంఘపాత్రపోషణలు మొదలగును.పాత్రపోషణ అనగా తోటి జీవానికి తోటి జీవముతో లింకులు కూర్చడం. అవి ఎలాననగా నాభి మధ్యమ భాగంలో తీగల అలవరికలను ఏర్పరచి బాల్య జీవము మొదలు తల్లికిబిడ్డకు,సోదరి సోదరులకు,ఆ తదుపరి యుక్త నిర్వహణలో స్త్రీ పురుష జీవులకు భార్యగా భర్తగా వాళ్ళ జీవ నిర్వహణల నుంచి ఇరువురి జీవితాలను పంచుకోవడంలో వాళ్ళ జీవిత అనుభవంలో నుంచి పిండోత్పత్తి క్రమములో మరి యొక్క శిశువు గతస్థితి యొక్క ఋణభారాలను బట్టి నాభి తీగలకు లింకులు వేయుట యందు మనస్సులో ఒకరికొకరు గుర్తు వచ్చి తెరరంఘ పాత్రపోషణ జరుగును. ఈ పాత్ర అన్నది ఎలా ఏర్పడెను అనగా ఇది మొదట స్థూలతొడుగుయే ఆ తదుపరి ప్రధమ నాడిలోనికణకదలిక సారాంసయుత తీగలో తల్లి జీవప్రమాణికము కదులుట యందు కాలము కాలగర్భంలో ఒక్కొక్క కోణపు లోతు వివరణలో పాత్ర నిర్మితమగుతు పోవును.ఆ విధంగా చూస్తే ఒక స్త్రీగా తల్లితండ్రి యొదుట కూతురిగా,ఆ తదుపరి సోదరిగా,ఆ తదుపరి భార్యగా, తల్లిగా,అత్తగా,పిన్నిగా,పెద్దమ్మగాఅవ్వగా,జేజిగా ఒక స్త్రీ నడకలో ఇన్ని పాత్రపోషణలు వయస్సు ప్రామాణికము తగ్గట్టుగా కాలగర్భంలో పాత్ర కదిలే దాని బట్టి పైకి మానవ నడవడిక తొడుగు కదులును.అలా తొడుగు కదలగా కదలగా జీవ ప్రమాణిక నడకలో ముఖస్తుతులు,ఆ తదుపరి పాత్రపోషణకు తగ్గట్టుగా తల్లి పాత్రపోషణ అయినట్లైతే తల్లి ముఖహావము,హావభంగిమలు ఏర్పడును.కావున తెరరంఘ ప్రదర్శన అంతయు గతస్థితి యొక్క ఋణబారములను బట్టి నాభి నిర్వహణ యొక్క తీగల అల్లికలలో తెరరంఘ పాత్రపోషణ జరుగుచున్నది.అందుచేత ఋణభారం ఉన్నంత సమయమేనని నాభి నిర్వహణ లింకు నుండి వాళ్ళు మన మనస్సులో గుర్తుకు వస్తారు.ఋణభారములు తీరబడగానే నాభి నిర్వహణలో లింకులు తీరబడుతాయి.కాబట్టి ఎవ్వరికి ఎవ్వరు గుర్తుండము.ఆ విధంగా చూస్తే పుట్టుట గిట్టుట యందు ఎవ్వరికి ఎవరం ఏమవుతామో తెలియలేదు.అలా మనలోని జీవప్రమాణికమునకు అనుభవం రావాలంటే తోటి జీవస్థితి యొక్క నడకలతో తెరరంఘ పాత్రపోషణ చేయవలసిందే.ఆరకంగా చూస్తే ఒక బమ్మ మరియొక బొమ్మ అనుభవానికి తోడ్పడతాయి.

Download PDF Now