14.ఒత్తిడిల నుంచి దూరము అగుటకు మార్గము :
A solution to escape stress
ప్రస్తుతము ఇప్పటి వరుకు మనయొక్క అనుభవంలో వివిద తెరరంఘ పాత్రపోషణల మధ్య మంచిని, చెడును, కష్టాన్ని, సుఖాన్ని, అపద్దాన్ని,నిజాన్ని,ఎక్కువ తక్కువ యొక్క పొరల నడుమున కోణపులోతు వివరణలో తల్లి,తండ్రి,సోదరి,సోదరుడు,భార్య,భర్త అలా జీవప్రమాణిక నడకలో కోణములోతు తగ్గట్టుగాఅర్థం కాకపోగా తల్లితో ఎట్లా వ్యవహరించాలో,తండ్రితో ఎట్లా వ్యవహరించాలో తెలియని యొక్క విధములో అంతర్గతముగా వారితో ఎటువంటి యొక్క ఋణభారములు తోసుకొనతెచ్చుకోబడి ఉన్నట్లైతే ఒకరిపైన ఒకరికి ఇది అనుభవింప బడుటలో వచ్చిన ప్రేమ వెలుబడినట్లైతే స్పందన ఉండును.లేక గతస్థితి యొక్క ఋణభారములైనట్లైతే ఎవరి పట్ల ఏమి కలుగుతుందో కూడ అర్థంకానివిధితములో జీవస్థితి ఒత్తిడికి లోనవును.మనము తీసుకొచ్చుకున్న కాలగర్భసంపద మన విలువను బట్టి మనకు వర్తిస్తుంది.కావున పేదలుగా ఎందుకున్నామో,ధనికులుగా ఎందుకున్నామో,మద్యస్తులగాఎందుకున్నామో గతస్థితిని బట్టి ఏమి తెలుసుకోదలసి ఇలా ఆడిస్తున్నాడో తెలియకపోతే ఒత్తిడి యొక్క ప్రభావము అత్యదికముగా పెరుగును.మనయొక్క అనుభవ విలువను బట్టి ప్రతిఒక్కటి మనకు సంక్రమిస్తుందని కాల అనుభవ నిర్వహణలో గమనపు లోతుల్లో ప్రయాణము చేస్తే తప్ప అర్థం కాదు.ఆ విధముగా చూస్తే మనకు కలిగే అనేక సందేహాలకు గాను సమాధానాలు మనలోపలే వెలువడబడక పోవుట ద్వారా అనేక ఒత్తిడిలకు లోనుకావడానికి అవకాశము ఉండును.ఈరకపు ఒత్తిడిలను అన్నింటిని తగ్గించుకోవాలంటే మనపై మనకుగా గమనము అలవడితే తప్ప ఏవి ఎందుకు జరుగుతున్నాయొ సరియైన కారణాలు వెలువడవు.అలా వెలువడనంత వరుకు ఈ ఒత్తిడి యొక్క ప్రభావము తగ్గదు.ఒకవేళ గమనమే అలవడినట్లైతే మనస్సు అద్దపులోతును బట్టి గమనము లోతు పెరుగుతూ పోవును.అలా పెరుగుట ద్వారా ఆంతరంగికములో మనం కల్పించుకొన్న కల్పితములన్నియు గుర్తెరిగి సరిమల్చుకొనుటకు ఉండును.అదే విధంగా అంతర్గతములో గతస్థితి యొక్క ప్రకారంగా తెచ్చుకొన్న ఋణభారములను గుర్తు ఎరిగి నేను తెచ్చుకొన్నవి నేనే తీర్చుకోవాలనన్న విధానంలో భరించే స్థితి నాకు వచ్చును.అదే విధంగా కాలానుభవంలో ప్రస్తుతం నేను ఇప్పటి వరుకు అనుభవించిన అనుభవము ఆంతర్యములో వాడు నన్ను పరీక్షించే విధానమును గుర్తెరిగి ఆ పరీక్షలో నెగ్గి ముందుకు సాగుటకు యత్నించెదను.అలా ఆ రకంగా గుర్తు ఎరిగితే అనేకరక ఒత్తిల్ల నుంచి జీవప్రమాణికము బయటపడి జీవిత ప్రయాణమును ముందుకు సాగించుటకు అవకాశం ఉండును.అలా కాని యెడల మరల మరల పుట్టటం,గిట్టటం అన్నది జరుగును.తదనుగుణంగా సమయము వృదా అవుతుందే తప్ప నాయొక్క అనుభవపూర్వకమెనౖ ప్రయాణము ముందుకు సాగదు.