విద్యా విషయాలు

ఆది మొదలు అనంత నిర్వహణల మధ్య సాగుతు పోయే ప్రయాణం.
సృష్టి: ఈ సృష్టికర్తలోని అణువులము కావున సృష్టి విస్తారత కొరకు శక్తియే ఎలా పుట్టుకొచ్చును అన్న విధానమున ఆది మొదలు ఒకయొక వెలుగు ఉద్భోదకము కొరకు జనించబడ్డ మానవజన్మ.
1. ఈ మానవజన్మను ఎత్తిన విధానము.
2. స్థూలకథల నిర్మాణములు
3. కాలగర్భ పుట్టుకలు
4. కాలక్రమదారులు విషయసంపుటిల నుంచి వెలువరింపబడిన విధానం.
5. కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులుగా నిర్మితం అయిన విధానం.
6. అన్ని కాలాలు ఏకకాలంలో కదులు విధానము.
7. కాలసమయస్థితితో కూడుకోబడిన పొరను రూపొందించిన విధానం.
8. బాహ్యపుపొరపైన శబ్దపుపొరను, దృష్యచిత్రీకరణ పొరలను అలవరిచిన ప్రాకృతికమండలాల పనిక్రమతీరులు.
9. కాలము, సమయము, దిక్కులు, భూగ్రహాలు, రాశుల సంఖ్యాఫలాలు, పేరుబలాలు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలాల పనిక్రమము.
10. ఆయా కాలక్రమదారులలో ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికములు జీవించిన విధానము.
11. పాత్ర నిర్మాణములు.
12. బాహ్యానుభవలోతుల్లో బాహ్యలోకమును చిత్రీకరించిన ప్రాకృతికమండల పనిక్రమతీరు.
13. మనస్సు పుట్టుక
14. మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమ విధానము.
15. ఆలోచనాస్థితి నుంచి గమనించేస్థితికి వచ్చే విధానము.
16. గమనము ఏర్పడుట
17. మనస్సులో మనిషిగా తయారు అయ్యే విధానము.
18. మనస్సే హృదయముగా మారుతు పోయే విధానము.
19. ప్రధానాంశస్థితి వివరణ, ఆకారిత వివరణ
20. అనుభవమే జ్ఞానముగా పరిగణలోనికి వచ్చు విధానము.
21. హృదయము యొక్క ముఖద్వారము అంతర్ మధ్యమముగా మారడము.
22. అంతర్ కదిలకల పట్ల జీవుడు అనుభూతినొందడము.
23. భ్రూమధ్యమమున జ్ఞానము అనే మొలక మొలవడము.
24. బ్రహ్మరంధ్రం విచ్చుదల అయ్యే విధానము.
25. జ్ఞానమొలక నుంచి జ్ఞానప్రసారములు వెలువరింపబడుట
26. ఆ జ్ఞానప్రసారములే మొట్టమొదటిగా శక్తాయుత ధారగా మారుట.
27. అంతర్ మధ్యమము నుంచి పరిపూర్ణ అర్థ పరనడుమున సూక్ష్మములోనికి ప్రయాణించుటకు సూక్ష్మకథలు మొదలగుట.
28. సూక్ష్మలోకముల పుట్టుక
29. సూక్ష్మదేహం నుంచి సూక్ష్మ ఆకారితజీవిగా విడుదల అగుట.
30. సూక్ష్మజీవిగా సూక్ష్మజీవియే ఎరుకజీవిగా మారుట
31. ఎరుకజీవియే జీవాత్మగా మారుట
32. ఆత్మాయానస్వరూపముగా మారుట చివరకు ఒక వెలుగు స్వరూపంగానే మారును.
ఇలా ప్రతిఒక్క వాటియొక్క పుట్టుక ఆధారక్రమములను గురించి సంభాషణ విధానములో తెలియజేయడం జరుగును. కావున ఈ విద్యను ఐదు పర్యాయములుగా అలవరిచి ప్రస్తుత ఒక్కొక్కరి అనుభవస్థితిగతులను బట్టి వాళ్లకు భోదించడం జరుగును.