మానవాళికం

61.) నేనే అన్ని విషయాల పట్ల మొదటిగా ఉండాలని అనుకుంటాను ఎందుకు?

మీలో అన్ని విషయాల పట్ల విషయార్థితము విషయ అవగాహనలో విషయానుభవాలు వెలుబడి అందున విషయపు మెలుకువలలో విషయ పరిజ్ఞానము అంతటా వుండుటలో మీరు అన్ని విషయాల పట్ల మొదటిగా ఉండాలి అనుకోవచ్చు.కాని విషయాలే తీసుకున్నట్లైతే తల్లితండ్రికి సంభందించిన విషయాలు,భార్యాభర్తకు సంభందించిన విషయాలు,తండ్రికి బిడ్డకి సంభందించిన విషయాలు ఇలా నాల్గు కోణాలు కలిసి ఒక విషయ అల్లికతో కూడుకోబడిన దారి పరిగణలోనికి వచ్చును.కాని ఆ విషయములో పాల్గొన్న తల్లి పాత్రపోషణలో తల్లికి ఎంత అనుభవలోతు వుందో బిడ్డ పాత్రపోషణ పట్ల బిడ్డజీవమునకు ఎంత అనుభవలోతు వున్నదో అది వాళ్ళ మనస్సు లోతులను బట్టి వాళ్ళలో కదిలాడు తుండును.కావున నీవు కూడ తల్లి,బిడ్డ రెండిటి యొక్క అనుభవలోతులు అన్నవి నీకు పూర్తిగా అలబడివుంటేనే ఆ తల్లిబిడ్డల వ్యవహారికం నీకు అర్థమగును లేనిచో తల్లిపట్ల బిడ్డకు,బిడ్డపట్ల తల్లికి గతస్థితిలో ఎటువంటి ఋణాలు తెచ్చుకొనివుంటే వాళ్ళ ఇరువురి నడుమున అలా సాగుతున్నదో అన్న విధానము వాళ్ళ గతగతస్థితిలు తెలియకుండా ప్రస్తుతము మనకు తెలిసిన తల్లిబిడ్డల విషయాలనే తీసుకుంటే మన అనుభవాల్ని బట్టి తల్లిబిడ్డలు అంటే ఇలా ఉండాలి అనుకుంటాము.కాని వీళ్ళు ఇలా వున్నారు అంటే గతస్థితి నడకయే ప్రస్తుతము సాగుతున్నది అని తెలియకపోయినట్లైతే ప్రతిఒకరి విషయములోనే మనము ఉండాలని అనుకోవద్దు.ఇంకా ఆ విషయము మనకళ్ళ ముందరే సాగుతున్నట్లైతే అదే అనుభవములో మనము వున్నాము కావున అర్థం చేసుకొని అవగాహనగా మన మనస్సులో మనము కదలవలె.ఒకవేళ బాహ్యానికి మాట్లాడదలిస్తే ఆ విషయములో పాత్రపోషకులు ఆ పాత్రనిర్వహణలలో ఎంతటి లోతులు కల్గినవారో అనగా భార్య పాత్రపోషణ పట్ల భార్య అనుభవము,భర్త పాత్రపోషణ పట్ల భర్త అనుభవలోతులు అలా ఇరువురి లోతులను అది పాత్రపోషణలలో మనకు ఏర్పడిన లోతుల్లో నుంచి వాళ్ళ లోతులను అర్థం చేసుకుంటే వాళ్ళకు తగ్గట్టుగా (లేక) విషయము అర్థం అయ్యేటట్లు విషయారంభ మలుపులు ముగింపు నిర్వహణ వరకు అర్థం అయ్యేటట్లు చెప్పే విధానము మనకు చేతనగును.అప్పుడే సరివివరణ పరనడుమున వాళ్ళలోని భార్యతనాన్ని,భర్తతనాన్ని తెలియజెప్పి వాళ్ళలోని అనుభవాల్ని కదిలించి స్పందించేటట్లు మాటలు వుండవలె. అంతేకాని వాళ్ళ అనుభవపూర్వక లోతులు కూడ వాళ్ళ మధ్య ఆ విషయములో ఏం సాగిందో తెలియకుండా ఆ విషయములోనే అంతర్గతముగా వాళ్ళు ఎటువంటి ఋణాలు తెచ్చుకున్నారో తెలియకుండా విషయాలలో కలుగజేసుకొనుటకు వుండదు.మనకందరికి ఆ విషయాలలోనే తల్లియైన, తండ్రియైన, మంచియైన, చేడుయైన విషయాలలోనే తెలియవచ్చెను.ఎందుచేతననగా కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులే కాలక్రమదారులు అవుట ద్వారా ఆ కాలక్రమదారులలోనే స్థూలతొడుగులలోని జీవ ప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులలోని జీవప్రమాణికములచే జీవించబడ్డాయి.కావున ఆ అనుభవలోతుల్లోనే మనస్సు అన్నది ప్రతి స్థూలతొడుగుకు అలబడుటలో ఆ మనస్సులో మనిషిగా మనము తయారవుతున్నాము.కావున ప్రస్తుత మనకు ఏర్పడిన మనస్సు లోతును బట్టి ఎదుటనున్న మనిషిలోతులు మనకు అర్థం అయ్యి మాట్లాడవలె.కాని ప్రస్తుత ఇప్పటివరకు మన మనస్సే ఎంతటి లోతుల్లో ఏర్పడినదో తెలియకపోతే ఎదుటనున్న మనిషిలోతు అన్నది మనకు ఎలా తెలియవస్తాది.కావున ఎవరివైన గతస్థితి ప్రస్తుతస్థితులు తెలియకమునపే ఎవరి విషయాలలోనే ముందుగానే ఉండాలని అనుకొనము.అదేవిధంగా మన మనస్సులోతుల్లో గమనముయే ఉన్నట్లైతే ఏ విషయములో ఎంతవరకు కలుగజేసుకొనవలెనో తెలియును.కావున ఒక విషయాలలో పాల్గొనవలెనంటే మొదలు ఆ విషయానుభవ లోతులో మనకు ఎంతటి అర్థము అవగాహనలు మన అనుభవలోతుల్లో వున్నాయో తెలియరావలె.అప్పుడే వాళ్ళ విషయాల పట్ల కలగజేసుకొని మనము వ్యవహరించిన విషయం చక్కటి కొలికి తీసుకరాగల్గుతాము లేక ఎక్కువతక్కువలుగా వ్యవహరించినట్లైతే మరల వాళ్ళకు ఋణగ్రస్తులై మిగులుతాము.ఎందుకంటే వున్న విషయమును వున్న విషయముగా పోనివ్వగా మనము ఇష్టం వచ్చినట్లు మలిస్తే వాళ్ళ విషయములో ఏది అనుభవించే విధానము కాలమునకు ఋణముగా పరిగణించి ఆ విషయములో తిరిగి మనము పడవలసి యుండును.కావున మనయొక్క విషయానుభవ లోతులు మనకు తెలియకమునపే ఇతరుల విషయాలలో ముందుగా ఉండాలి అని అనుకోవద్దు.వాళ్ళు తమ అనుభవములో ఆ విషయము పట్ల ఎలా వ్యవహరిస్తారో చూస్తు వుండవలె అవసరమయితే సమయ సందర్భ నిర్వహణకు తగ్గట్టుగా విషయాన్ని వివరించి చెప్పవలె.

Download PDF Now