మానవాళికం

31. మనస్సన్నదే ఎలా పుట్టుకొచ్చెను? ఆ మనస్సుయే ఒకరక మనస్థత్వంగా ఎలా మలువబడెను?

మనము అని చెప్పుకునే మనమందరము కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులుగా నిర్మితం అయ్యాము. అలా కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణములు పూర్తి కాబడెను. ఆ తరువాత కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగు జీవప్రమాణికములు జీవించడమనగా ఆ స్థూలతొడుగు యందే స్త్రీనాడీమండల లింకులను బట్టి స్త్రీతొడుగుగా నాల్గు వయస్సు ప్రమాణికముల పాత్రపోషణాయుత అలవరికలో కదిలి జీవించడం జరుగును. ఆ తదుపరి జీవితకాలం పూర్తి అగుటలో గిట్టిపుట్టుటలో ఆ స్థూలతొడుగుయే పురుష నాడీమండల లింకులను బట్టి పురుషతొడుగుగా ఉత్పన్నం అగును. అలా అన్ని కాలక్రమములలో కూడుకోబడిన దారులు ఒక స్థూలతొడుగు అనుసారికములోనే వుండబడుట ద్వారా చుట్టు కాలసమయస్థితితో కూడుకోబడిన ఆర విడుదల చేయడంతో పాటు మనస్సు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఒక ప్రకృతి యొక్క అణువును విడుదల చేయును. ఆ అణువునకే మనస్సు అనే పేరు. ఆ తరువాత ఆ కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో జీవించుట ద్వారా అవి అనుభవమైన దారులుగా చివరకు మనస్సుదారులుగా అలబడెను. అలా ప్రతిఒక్కరికి ఒక మనస్సన్నది పుట్టుకొచ్చెను. కాబట్టి ఎవరి మనస్సుదారులలో వారికి వాళ్ళు తమ అనుభవములో తాము జీవించడం మొదలైనది. ఆ అనుభవములో స్థిరస్థితిగా కొంచెంకొంచెం నిలద్రొక్కుకుంటురావలె. ఒకవేళ నిలద్రొక్కుకొనలేకపొతే చచ్చిపుట్టడముతో మనస్సులో మనిషిగానే తయారుకావలసిన మనము ఇంకా ఒకసారి చచ్చిపుట్టుటలో ఆడమనిషిగా ఇంకొకసారి చచ్చిపుట్టుటలో మగమనిషిగా చచ్చిపుట్టుట వరకు వచ్చాము. కాని ప్రస్తుత ఇప్పటివరకు మనస్సు లోతు ఎంతవరకు ఏర్పడింది అని కాని ఎంతవరకు విస్తరించి వున్నది అని కాని మనయొక్క గమనములోనికి రాలేదు. ఎందుచేతననగా ఇంకను మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమములో ఆలోచన నిర్వహణలోనే మన అనుభవాల్ని అందుకొని బాహ్యానికి ప్రదర్శిస్తున్నాము. కాబట్టి మన మనస్సు యొక్క దారులలో స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడేలోపే అర్థం అయ్యి కాక, ఇష్టము అయిష్టత చేత, అసంతృప్తి సంతృప్తి పరనడుమున ఆ మనస్సుదారులను అటుఇటుగా వంకరముగా మలుచుకున్నాము. అలా మలుచుకొనుటలో ఆ మనస్సు పదపుట్టుకకు కారణమైన ప్రకృతి యొక్క అణువు మనస్సుపొరను మనస్థత్వపొరగా మలిచెను. ఆరకంగా ఒక్కొక్కరక మనస్థత్వాన్ని మలుచుకొన్నాము.

Download PDF Now