మానవాళికం

36. మనస్థత్వ పరనడుమున మానసికము మొదలు అవుటలోనే శారీరకంపైన ప్రభావం చూపుతు వచ్చే విధానం?

ఎవరికివారుగా వాళ్ళ మనస్సుదారులలో స్థిరస్థితి అయిన అనుభవము పూర్తి అలబడకమునుపే అర్థం అయ్యి కాక లేక ఇష్టము అయిష్టత చేత, సంతృప్తి అసంతృప్తికర పరనడుమున అటుఇటుగా మలుచు కొనుటలో అవి మనస్థత్వదారులుగా మారును. ఎందుచేతననగా మనస్సు అనే పడనడకకు సంబంధించిన ప్రకృతి యొక్క అణువు దారులు సరివివరణాత్మక అనుభవదారులుగా కదులుట అన్నది మనస్సుపొరలో అలా సరివివరణాత్మకంగా ఒక తీగఅల్లికతో కూడుకోబడిన దారి తరువాత ఒక తీగఅల్లికతో కూడుకోబడిన దారులలో జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో కదిలాడుతు జీవిస్తున్నట్లైతే మనస్సుపొరలో ఆ మనస్సు యథాస్థితిగానే యుండును మరియు తేలికగా యుండును. ఎప్పుడైతే అటుఇటుగా వంకరముగా మలుచుకోవడం జరుగునో ఆ మనస్సుపొరనే మనస్థత్వపొరగా మలుచును ఆ మనస్సు అనే పడనడక పరనడుమున కదిలాడే ప్రకృతి యొక్క అణువు. ఇలా వుంటే ఆ మనస్థత్వ వంకరదారి కాలసమయస్థితి ప్రకారంగా ఎలా కదిలితే అదేవిధంగా మనిషి అని చెప్పుకునే ఈ స్థూలతొడుగు స్థూలరసద్రావకాలతో నిర్మితం చేయడం జరిగెను. మొదలు శిరస్థాయి మధ్యలో బ్రహ్మరంధ్రం, బ్రహ్మరంధ్రం చుట్టు అలవరచబడిన జన్మపర్యంతపుపొరలు ఆ బ్రహ్మరంధ్రం నుంచి పుట్టుకొచ్చిన ప్రథమనాడులు, ఆ ప్రథమనాడులలోనే స్థూలనాడీమండలాలు ఒకదాని తరువాత ఒకటిగా నిల్వరింపబడియుండును. స్త్రీ నాడీమండలము యందు స్త్రీకణాలు, పురుష నాడీమండలము యందు పురుషకణాలు. కాబట్టి ఇది మొదలు స్థూలతొడుగుయే, అందులోని స్త్రీ నాడీమండల లింకులను బట్టి స్త్రీతొడుగుగా ఆ తదుపరి గిట్టిపుట్టుటలో పురుషనాడీమండల లింకులను పురుషతొడుగుగా ఉత్పన్నమగును. అందుకనే మొదలు ఆడమనిషియని, మగమనిషియని ఆ తరువాతనే మనస్సులో మనిషిగానే తయారు అగును. కాబట్టి మనస్సులో రెండిటి యొక్క అనుభవపూర్వక దారులు యుండును. కావున స్త్రీలు పురుషులను అర్థం చేసుకోగల్గుతారు, పురుషులు స్త్రీలను అర్థం చేసుకోగల్గుతారు. ఎందుచేతననగా ప్రతిఒక్కరికి మనస్సు వున్నది. అలా మనస్సులో మనిషిగా తయారు అవుట మొదలులోనే ఒకసారి చచ్చిపుట్టుటలో ఆడమనిషిగా మరొకమారు చచ్చిపుట్టుటలో మగమనిషిగా అన్నటుల చచ్చిపుడుతూనే వున్నాము. కాని ఇంతవరకు స్త్రీ అనుభవలోతు ఎంత ఏర్పడినదో, పురుష అనుభవలోతు ఎంతవరకు ఏర్పడినదో ఆ రెండిటి అనుభవాలచే మనస్సులో మనిషిగా ఎంతవరకు తయారు అయ్యామో తెలియక ఒక్కొక్కరు ఒకరక మనస్థత్వంలో చిక్కుకోవడం జరిగెను. ఆరకంగా చూస్తే నాల్గు వయస్సు ప్రమాణికమున ప్రతి పాత్రపోషణాయుత జీవప్రమాణికములు అన్నియు మనిషి అనే ఈ స్థూలతొడుగులోనే ప్రథమనాడులలో జీవించబడుతున్నవి. కాబట్టి ఈ స్థూలతొడుగులో జీవములు జీవించబడటానికి గాను ప్రథమనాడులలోని ఒక్కొక్క కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోనే జీవప్రమాణికములు జీవించును. కావున ఆ ప్రథమనాడుల నుంచి పిల్లనాడులు పుట్టుకొచ్చెను. పిల్లనాడులకు నర్వులు,నాళాలు పుట్టుకొచ్చు అమర్చుటలో ఆ పిల్లనాడులు, నర్వులు, నాళాల అలవరికలలోనే శిరస్థాయి మొదలు చెవులు, కన్నులు, ముక్కు, నోరు, గొంతు, వెన్నుముక్క, భుజాలు, ఆహారనాళము, శ్వాసానాళము, ఊపిరితిత్తులు, దమని, ప్రేవానుసారికము, మలమూత్రాది సంచులు, స్త్రీ పురుష శేషస్థితి భాగాలు, పైభాగాలు అయిన మెడ. చేతులు, కాళ్ళు ఇలా లోపలిభాగాలు, లోపలిభాగాల లింకులు అయిన పైభాగాలు జీవానుభవములను బట్టి కదిలాడుతుండును. ఎందుచేతననగా ఇవి అన్నియు స్థూలరసద్రావకాలతో నిర్మితమైన భాగాలు. ఆ ద్రావకాలు నిరంతరము కదులుతూనే యుండవలె. అప్పుడే మనిషి అనే ఈ స్థూలతొడుగు ఆరోగ్యకరంగా యుండును. అది ఏరకంగా నిరంతర కాలసమయస్థితితో కూడుకోబడిన దారులలో ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు కదులుతు జీవిస్తూనే యుండుటలో ఈ స్థూలతొడుగు ఆరోగ్యకరంగా మరియు ఇంకను జీవస్థితి ప్రమాణికములకు స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడే కొలది కొంచెంకొంచెంగా రాతిమనిషిగా, ఇంకా స్థిరస్థితి అలబడితే ఇనుము మనిషిగా, పూర్తి స్థిరస్థితి అలబడుటలో ఉక్కుమనిషిగానే తయారు అగును. కావున ఆ స్థూలతొడుగు యందు స్థూలరసద్రావకాలు ప్రతిభాగ నిర్వహణలో జీవానుభవ స్థిరస్థితిని బట్టి అలా తయారు అవుతు వచ్చును. కాని మనస్సుదారులను మనస్థత్వదారులుగా వంకరముగా ఎలా మలుచుకున్నామో ఆ మనస్థత్వదారులు ఎలా కదిలితే అలాగనే మనిషి అనే ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికము వంకరముగానే కదులుటలో ప్రతిభాగాములోని స్థూలరసద్రావకాలు కూడ వంకరముగానే కదులును. అప్పుడే మనకు వంకర వినికిడి, వంకర దృష్యం, వంకరమాట, వంకర చేత,నడక వచ్చును. కాబట్టి ఆ స్థూలరసద్రావకాలు కూడ వంకరముగానే కదులును. ఇలా జీవస్థితి ప్రమాణికములు మనస్థత్వ వంకరదారులకు తగ్గట్టుగా మరళ మరళ కదలగా కదలగా ఆ ద్రావకాలు వంకరగానే కదిలి కదిలి క్షీణదశకు చేరుకుంటాయి. ఆ శడ్రుచానుసార మిళితమే మనము చెప్పుకునే రక్తప్రసారములు. కాబట్టి ఈ తొడుగును రక్తమాంసములతో కూడుకోబడిన ముద్ద అని కూడ అనెదము. కాబట్టి ఆ ద్రావకాలు కూడ వంకరముగానే కదిలి జీవస్థితి కదిలికదలని విధానమున ఆ ద్రావకాలు గడ్డకట్టి, నీరుకారి, పసలుగా మారును. అలా లోపలిభాగాల మొదలు పైభాగాలు అన్నియు జీవానుభవ స్థిరస్థితిలను బట్టి చక్కగా కదలవలసినవి ఎక్కడికక్కడ కదలకుండా ఆగిపోతు వచ్చును. ప్రతిఒక్కరి మానసికము అన్నది శారీరకంపై ఈరకంగా ప్రభావం చూపును. కాబట్టి మనస్థత్వ దారులను సరియైన దారులుగా మలిస్తే తప్ప మనస్థత్వపొర పోయి అందున మానసికము పోయి శారీరకంగా నిలద్రొక్కుకుంటు వచ్చెదము.

Download PDF Now