మానవాళికం

38.) ఎవరి మనసాక్షి వాళ్ళ నడకనే ఎత్తిచూపడము:

ఎవరికివారికిగా వాళ్ళ మనస్సుపొరలో అంతర్వాణి నిల్వరింపబడుటలో ఆ మనస్సుపొరయే మనసాక్షి యొక్క పొరగా మారుటలో వాళ్ళు తమ మనస్సులోని దారులను ఇష్టము వచ్చినట్లుగా మలుచుకొనుటలో అవియే మనస్థత్వదారులుగ మారి వాళ్ళు వాళ్ళ మనస్థత్వ ప్రకారంగానే తోటి మనష్యులతో వ్యవహరించుటలో ఆ తోటివాళ్ళు వాళ్ళ వంకరనడకతో బాధపడిన లేక వ్యతిరేఖంగా తీసుకున్న లేక ఇతరులు అలా కాదు ఇలా అని చెప్తున్నా వినకపోగా వాళ్ళ మనస్థత్వ ప్రకారంగానే వాళ్ళు నడవాలని ప్రయత్నించుటలో వాళ్ళయే సరియైన నడక కాదు అని మనసాక్షి ఎత్తిచూపును. అనగా మనసాక్షియొక్క పొరలోని అంతర్వాణి వాళ్ళు సరియైన దారిని వంకరదారిగ మలుచుకొని ఆ వంకరదారి ప్రకారంగానే వ్యవహరించే విధానము వెలువరింపబడును. అదియే ఎవరి మనసాక్షి వాళ్ళ నడకను ఎత్తిచూపడము అనెదము. అప్పుడైన మనయొక్క వంకరదారిని గుర్తుఎరిగి సరిమల్చుకొని సరిదారి ప్రకారంగా బాహ్యానికి వ్యవహరిస్తామని మన మనసాక్షియే మన నడకను ఎత్తిచూపునట్లు అమర్చడం జరిగెను. కాబట్టి ఎవరి అనుభవస్థితిగతుల ప్రకారంగా వాళ్ళ మనస్సుదారులను మనస్థత్వదారులుగ మలుచుకున్నా అలా మలుచుకున్న విధానం చచ్చిపుట్టుట అలవరికలో గుర్తులేకున్నా వాళ్ళ మనసాక్షి ఎత్తిచూపినప్పుడే సరిమలచుకున్న ఆ సరిదారిని బట్టి మరళ జీవించబడుతు ఈ జీవితకాల ప్రయాణంలో ముందుకు సాగవచ్చు.

Download PDF Now