మానవాళికం

40.) మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమము ఎందుకు అమర్చడం అన్నది జరిగెను?

మొదలు మనమందరము కాలక్రమదారులలో జీవించుటలో అవియే మనయొక్క అనుభవపూర్వకమైన దారులుగ ఆ తరువాత మనస్సుదారులుగ మారెను. కాబట్టి ప్రతిఒక్కరికి మనస్సు అన్నది వున్నది అని అనుటలో ఎవరి మనస్సులోనివి వాళ్ళ అనుభవమైన దారులు కాని అవి మొదలు అనుభవదారులు. కావున ఎవరి మనస్సులోని దారులలో వాళ్ళు తమ అనుభవములో తాము జీవించడము అన్నది మొదలగును. కాబట్టి తమ అనుభవపూర్వక దారులలో తాము జీవించవలెనంటే వాటిని కదిలించవలె. అందుకగాన ప్రతిఒక్కరికి మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమమును అలవరచడము అన్నది జరిగెను. కావున కాలసమయస్థితి ప్రకారంగా మనస్సులోని దారులు కదులుటలో అదేవిధ రీతిలో మెదడులో కదులునట్లు, అలా మెదడు కదులుతుండగానే ఆ మెదడు నాడులలో నిల్వరింపబడిన ఆలోచనకు సంబంధించిన ప్రకృతియొక్క అణువు అదేరకరీతిలో కదులుతు ప్రథమనాడులలోని జీవ ప్రమాణికములను ఆ తీగల అల్లికలలోని వివరణలకు తగ్గట్టుగా కదిలించును. అలా కదిలించగా కదిలించగా తమ అనుభవములో తాము జీవించబడుతు ఆ అనుభవములో కొంచెంకొంచెంగా స్థిరపడుతు వచ్చును. ఆవిధంగా మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమమును అమర్చడం జరిగెను. కాబట్టియే మెదడు ఒక అద్భుతకరమైన పనిక్రమ వ్యవస్థ అని అన్నామే కాని ఆ మెదడులో అందునవి మన అనుభవాలేనని గుర్తించలేదు. అలా గుర్తించలేదు కాబట్టే మన మనస్సు లోతు కాని విస్తారత కాని మనకు ఇంతవరుకు తెలియరాలేదు.

Download PDF Now