మానవాళికం

47.) మానవజన్మకు అర్థం ఏమి? ఏ కారణ నిమిత్తమై ఈ తెరరంఘంపైకి వచ్చాము?

ఒకయొక వెలుగు ఉద్భోదకము కొరకు జనింపబడ్డది మానవజన్మ.ఆ తరువాత ఆ వెలుగుయే ఒక శక్తిగా మారుటలో ఈ సృష్టి అంతయు ఆ శక్తిచేతనే నడుపబడుచున్నది. కావున అది మొదలు ఎలా ఉత్పన్నమవుతుంది అని అనుటలో మానవజన్మను రూపొందింపచేయడం జరిగెను.కావున మొదలు స్థూల సూక్ష్మ వివరణల ఆధారంగా స్థూల సూక్ష్మ రసద్రావకాలు ప్రాకృతికమండలాల ఆధారంగా పుట్టుకరాబడుటలో స్థూల సూక్ష్మ వివరణలలో ఆ ద్రావకాల ఆధారంగా మొక్క ఆరంభదశ మొదలు ఫల పుష్ప వరకు స్థూలము కల్ప మర్రి వృక్షాయుత వేరు అనుసారికము వరకు సూక్ష్మమము వర్తించును. అదే విధంగా స్థూల సూక్ష్మ వివరణల ఆధారంగా చిన్నచీమ ఆధారితక్రమము మొదలు 24 లక్షల జీవరాశులు స్థూలము మిగిత 60లక్షల జీవరాశులు సూక్ష్మవివరణలలో పుట్టుకొచ్చెను.అది అన్నియు కలిసి మానవజన్మగా రూపొందింపచేయుటకు గాను బ్రహ్మరంధ్రం ఆధారంగా 72వేల నాడుల పుట్టుక ఆధారముగా అందున 84లక్షల మండలాలు రూపొందింపచేయుటకు గాను మొదలు స్థూలవివరణాలలో స్థూలతొడుగు యందు జీవప్రమాణికములను జీవింపచేయుటకు గాను మరియు ఆ స్థూలతొడుగులు నిర్మితం అవుటకు గాను కాలగర్భ ఆధారంగా కాలక్రమదారులను రూపొందింపచేస్తు రావుటలో స్థూలతొడుగు నిర్మాణములు కూడ గావింపచేస్తు వచ్చెను.అన్ని కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగు నిర్మాణములు కూడ పూర్తి అవుటలో ఆ తరువాత ఆ కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో జీవింపచేయుటకు అలా జీవింప చేయుటలో వెలుబడే అనుభవాల్ని బాహ్యపుతెరల నడుమున కానరావుటకు మరియు ఆ అనుభవాన్ని బాహ్యంలో నింపుటకు,ఎందుచేతననగా అనుభవమే జ్ఞానముగా పరిగణ లోనికి వచ్చును.కావున మనస్సువివరణ యందు ఈ స్థూలతొడుగు మనిషిగా తయారు కాబడటము,హృదయవివరణ వివరణల యందు రూపము,ప్రధానంశస్థితి వివరణలో ఆకారము అలా అన్ని రూపాలు ఆకారాలు కలిసి మానవరూపము,మానవ ఆకారము దాలిస్తేనే హృదయము యొక్క ముఖద్వారం అంతర్ మధ్యమముగా మారి అంతర్ కదలికల పట్ల జీవుడు అనుభూతినొంది భ్రూమధ్యమున జ్ఞానము అనే మొలక మొలిస్తేనే జ్ఞాన ప్రసారముల నడుమున మొట్టమొదటిగా శక్తిధార పుట్టును.కావున మానవజన్మకు అడుగు అడుగు అర్థచింతనను తీగల అల్లికల నడకల్లోనే అలవరిచేసే ఆ తీగయే చివరకు శక్తాయుత తీగగా తయారు అగును.

Download PDF Now