స్థూల వివరణ

108.) బాహ్యనుభవలోతులు అని అనుటలో అడుగు అడుగుకు శబ్దపుపొరలు వేరువేరుగా యుండునా లేక ఒకలాగే యుండునా?

sthoolavivarana

ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులను రూపొందిస్తు పోవుటలో ఒక కాలక్రమ దారులు తరువాత రెండవ కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు కదిలి జీవించును. కావున అలా జీవించుట యందు వెలుబడే అనుభవాల్ని స్థూలతొడుగు పైభాగంలో చూపు విధానమునకు గాన బాహ్యపుపొరను అలవరచవలె. కాబట్టి ఒకటవ కాలక్రమదారులకు గాన ఒకటవ బాహ్యపుపొర, రెండవ కాలక్రమదారులకు గాన రెండవ బాహ్యపుపొర అన్నటుల ఒకటవ బాహ్యపుపొరపైన రెండవ బాహ్యపుపొరను నిల్వరింపచేస్తు పోబడటము జరుగును. అదేవిధంగా ఒకటవ కాలక్రమ పరనడుమున ఒకటవ బాహ్యపుపొరను భూతెరలపైన అలవరుచుటలో ఆ ఒకటవ కాలక్రమదారులు అన్నవి మొదలు కోణపుతీగలు అవుటలో అలా ఒక్కొక్క తీగను అల్లిక వేయుటలో ఆ తీగఅల్లికకు గాన పదశబ్దాన్ని కూర్చును శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కాబట్టి ఆ ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి మొదటి కాలక్రమదారులు మొదలు ఏ స్థూలరసద్రావకాలతో తీగలుగా నిర్మాణము కాబడెనో ఆ ఒక్కొక్క స్థూలద్రావకమునకు గాన ఒక్కొక్కరక శబ్దమును ప్రాకృతికమండలము వెలువరించియుండును. కావున శబ్దాలన్నింటిని ఏకం చేస్తు అత్యంత పలుచని శబ్దపుపొరను నిర్మాణము చేసి ఒకటవ బాహ్యపుపొరపైన నిల్వరింపచేయును ప్రాకృతికమండలము. అదేవిధంగా రెండవ కాలక్రమదారులు అని అనుటలో రెండవ కోణపు తీగల అల్లిక రసద్రావకాలకు గాన ఏరక శబ్దాలు వెలువరింపబడునో ఆ శబ్దాలని అన్నింటిని ఏకంచేసి శబ్దపుపొరను నిర్మాణము చేయును. అలా నిర్మితం అయిన శబ్దపుపొరను రెండవ బాహ్యపుపొరపైన నిల్వరింపచేయును. అలా ఏ కాలానికి అయా కాలక్రమదారులను బట్టి బాహ్యపుపొరలపైన శబ్దపుపొరలను నిల్వరింపచేయడం జరుగును.