స్థూల వివరణ

122.) అలలు అనగానేమి అవి ఎన్ని రకాలుగా యుండును? వాటి యందు శబ్దాలు కూడ మారుతు పోవునా?

sthoolavivarana

అలలుగా నీళ్ళు ఎలా కదులుననగా ఆ నీళ్ళలో నిల్వరింపబడిన తీగల అల్లికలు ఆ తీగలే రకరకాల తీగలు అనగా స్త్రీతీగ, పురుషతీగ. ఆ రెండు తీగల అల్లికలలో పిల్లతీగ ఇలా మన జీవిత నిర్వహణ సత్సంబంధ బాంధవ్యాల తీగల అల్లికలలో ఎలా సాగనున్నదో అదేరీతిలో స్థూలరసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఒక్కొక్క ద్రావక నిర్వహణలో ఒక తీగను నిర్మాణము చేయును. అలా నిర్మాణము చేస్తునే ఒకటి తరువాత ఒకటిగా నీటిలోనికి వెలువరింపచేయుటలో తీగల సంఖ్యా పరిణితిని బట్టి నీటి శాతము పెంచుతు వచ్చును నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కావున ఆ తీగల నిర్మాణమునకు కారణమైన ప్రాకృతికమండలమే నీళ్ళలో విడివిడిగా వున్న తీగలను అల్లిక వేయును. అలా అల్లిక వేయగానే ఒక్కొక్క తీగ అలవరికలో కదిలాడే నీళ్ళు ఒక నీళ్ళపై ఒక నీళ్ళుగా తీగలు ఎలా అల్లికలలో కదులుతాయో నీళ్ళు కూడ అదేరీతిలో కదులును. అలా కదిలే విధానమునే అలలు, అలపైన అల అన్నటుల తీగఅల్లిక నడకల్లో నీళ్ళు కదులును. అలా ఎన్నో అలలు అని అనుటలో స్త్రీ పురుష, భార్య భర్త, తల్లి బిడ్డ ఇలా ఒక బంధానికి ఒక బంధపు తీగలని ఎలా అల్లికలు కూడునో అన్ని అలలు వెలువరింపబడును. ఆరకంగా చూస్తే ఒక్కొక్క తీగఅల్లిక నడకకు గాన ఒక శబ్దము ప్రకృతియొక్క అణువులో నిల్వరింపబడి ఆ నీళ్ళలోనే యుండును. కావున తీగల అల్లికలను బట్టి అణువులు శబ్దాలను వెలువరించగా ఆ శబ్దాలు కూడ ఒక శబ్దములో ఒక శబ్దము ఏకమయ్యి ఆ అలల నడకకు తగ్గట్టుగా కదులును. అప్పుడే వాటినే అలల శబ్దాలుగా పలుకబడెను.