స్థూల వివరణ

148.) మనయొక్క మనస్సు లోతుల్లో ఏర్పడబడే సుడుల నిర్వహణలలోనే బాహ్యానుభవ లోతుల్లో సుడులు ఏర్పడునా?

sthoolavivarana

కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించుట యందు వెలుబడే అనుభవాలను బాహ్యంలో ప్రదర్శినాపూర్వకముగా పెట్టుటకు గాన మనతో పాటు బాహ్యలోకము పుట్టుకొచ్చెను. ఆ తదుపరి అన్ని కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు వివిధరక పాత్రపోషణలలో జీవించును. కావున ఆ స్థూలతొడుగు అనుసారికము చుట్టు కాలసమయస్థితితో కూడుకోబడిన ఆరను విడుదల చేయడం అన్నది జరుగును. ఆ కాలక్రమదారులలోనే స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించును. కావున ఆ కాలక్రమదారులే జీవానుభావపూర్వక దారులుగా ఆ తదుపరి ఆర నిర్వహణలో మనస్సు అనే పదనడక పుట్టుకొచ్చి మనస్సుదారులుగా మారును. అప్పుడు మనస్సులో మనిషిగా తమ అనుభవములో జీవించడము మొదలగుటలో ఆ అనుభవాల్ని బాహ్యపుపొరల నడుమున ప్రదర్శనాపూర్వకముగా పెట్టడములో కొంచెంకొంచెంగా బాహ్యలోక విస్తారత పెరుగుతు వచ్చును. కాబట్టి మన మనస్సులో సరివివరణాత్మక దారి అలవరికలో కదిలే విధానమునే బాహ్యానికి అదే సరినడకగా సాగుదము. కావున బాహ్యప్రసారములు కాలసమయస్థితి ప్రకారంగా ముందుకు సాగును. కాని ఎప్పుడైన ఆ మనస్సుదారులలో స్థిరస్థితి అయిన అనుభవము ఆ మనషిలో కదిలాడే జీవప్రమాణికములకు రాకపోవుట ద్వార ఆ దారులను మొదలు అటుఇటుగా వంకరముగా మలుచుకోవడము, ఆ వంకరదారులలోనే జీవించబడుతు మరింత వంకరముగా మలుచుకొనుటలో మనస్సు లోతుల్లో సుడులు ఏర్పడుతు వచ్చును. అదేవిధంగా ఆ వంకరదారుల అలవరిక ప్రకారంగానే బాహ్యానికి ప్రదర్శించడం జరుగును. కావున ఆ బాహ్యప్రసారములు కూడ అదే వంకరముగా కదిలాడుటలో ఆ వంకరనడక చిక్కుముళ్ళు పెరుగుటలో బాహ్యానుభవలోతుల్లో కూడ సుడులు ఏర్పడును. కాబట్టి మనస్సు లోతుల్లోని సుడులను బట్టియే బాహ్యానుభవలోతుల్లో సుడులు ఏర్పడును.