స్థూల వివరణ

165.) చినుకులు అన్నవి సన్నగా పడుటకు మరియు లావుగా పడుటకు కారణమేమి ?

sthoolavivarana

మేఘముల నుంచి నీటి అలవరిక నడక సన్నగా లేక లావుగా పడుటకు కారణములు ఏమనగా ఆ మేఘముల మధ్య నిల్వరింపబడిన తీగల అల్లికల నడకలే. వాటినే మేఘాయుత తీగలు అనెదము. కావున ఆ తీగలు కదిలే విధానమును బట్టియే మేఘముల నుంచి నీటి అలవరిక వెలువరింపబడును. కాబట్టి ఆ మేఘాయుత తీగలు అన్నవి వేటి నిర్వహణలో వెలువరింపచేయడము అన్నది జరిగెను అనగా అవి కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. ఆ కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు జీవించగా వెలుబడిన మొదటి అనుభవమున ఒక్కొక్క కోణపుతీగల అల్లికలకు గాన ఆ కాలమనే భూపొరలో భూసారాంశయుతతీగలను నిల్వరింపచేయడం జరుగును. అప్పటి నుంచి ఆ జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో తాము కదిలే విధానమును బట్టి ఆ భూసారాంశయుత తీగలలో సారాన్ని కూడగట్టడం జరుగును. అదీనూ ఎంతటి అనుభవమేర కదులునో అంతటి సారాన్ని మాత్రమే కూడగట్టడం జరుగును. ఆ సారస్థితి నడకను బట్టి ప్రాకృతికమండలము తీగలను నిర్మాణము చేసి ఆ తీగలనే మేఘాయుత తీగలుగా మేఘములలో నిల్వరింపచేయును. కావున భూసారంశయుతతీగలు ఎంతటి సారవంతముతో వున్నాయో దానిని బట్టియే మేఘాయుత తీగలు కదులును. కావున ఆ మేఘాయుత తీగలు కొంచెంగా కదులుతునే మేఘం కొంచెంకొంచెంగా ఆ నీటిధారలను వెలువరించును. కావున సారస్థితి కొంచెం వున్న యెడల సన్నని చినుకులు పడును, సారము అన్నది కొంచెంకొంచెంగా పెరిగేకొలది చినుకులు అన్నవి కొంచెంకొంచెం పెద్దచినుకులుగా పడును. ఆరకంగా చూస్తే సన్నని చినుకులు పడుటకు అయిన లావుచినుకులు పడుటకు అయిన మేఘాయుత నడుమున తీగలు కదిలే విధానమును బట్టి ఆ మేఘం వర్షించును.