స్థూల వివరణ

30.అనుభవ సారమనేది కణకదలిక సారాంశయుతతీగలకు ఎలా అందును?

sthoolavivarana

నిరంతరము కాలసమయస్థితి ప్రకారంగా దారులు కదులుతుంటే అక్కడి నుంచి శ్వాస వెలువరింపబడి ఆ శ్వాస ముక్కుకోన నుంచి ప్రథమశ్వాసానాళము,శ్వాసానాళము నుంచి నాభి మధ్యమభాగము లోనికి చేరుకొని నాభిపొరల నడుమున తిరుగుతు ప్రథమనాడీలోనికి చేరి కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రమాణికమును ఆ కణములోని వివరణకు తగ్గట్టుగా శ్వాస ఆధారంగా కదిలించగానే అదే తీగఅల్లిక పరనడుమున ఇంకొక తీగను భూసారాంశయుత తీగగా విడుదల చేయును.అలా విడుదల చేయబడగానే ఆ తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా ప్రాకృతికమండలము రసస్థితి యొక్క ద్రావకాలను విడుదల చేయగానే కాలగర్భానికి నాభి యొక్క మధ్యమభాగానికి లింకులు అలవరుచుట ద్వారా ఆ రసద్రావకాలు కాలగర్భ మధ్యమము నుంచి నాభి మధ్యమ భాగములోనికి చేరుకొని అక్కడి నుంచి ప్రథమ నాడీలోని కణకదలిక సారాంశయుతతీగలోనికి చేరుకొనును.అలా తీగఅల్లికలోనికి చేరుకోగానే ఆ తీగలోనికి వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదిలి జీవించిన అనుభవాన్ని బట్టి ఆ ద్రావకాలను మిళితం చేస్తు సారంగా మలిచి సారాంశయుతతీగగా మారుటలోనే ఆ సారాంశయుతతీగలోని సారము నాభిపొరలకు వెలువరింపబడును.