స్థూల వివరణ

81.)ఒకమారు రాతి నిర్మాణంలో శబ్దము వెలువరింపబడిన తరువాత అది అలాగే నిల్వరింపబడి యుండునా?

sthoolavivarana

భూపొరలలో ప్రాకృతికమండలము రసస్థితి ద్రావకాలను వెలువరించి జీవానుభవ స్థిరస్థితి మేర ఆ రసద్రావకాలను మిళితం చేసి లేక పొరలుగా అలవరచి రాతిని నిర్మాణము చేయును. అనగా రెండు మూడు రకాల రసద్రావకాలను మిళితం చేయుటలో రాతిఅలవరిక గుండ్రంగా లేక పచ్చాలుగా ఒకేరీతిలో తయారుకాబడును.పొరలు అని అనుటలో ద్రావకాల నిష్పత్తులను బట్టి పలుచటి పొర నిర్వహణలో ద్రావకాల నిష్పత్తులు పెరుగుతు పోయేకొలది మందపాటిపొరగా తయారుకాబడుటలో ఒక రాయి కొంత శాతపరిధిలోనే ద్రావక నిర్వహణలో తయారుకాబడును.అక్కడితోనే దాని పరిమాణము ఆగును కాబట్టి ఆ రసస్థితి ద్రావకాలు నిల్వవున్నంతవరకు రాయిలాగా వుండును.దానిని బట్టియే శబ్దాన్ని బట్టి ఆ రాతిలో నిల్వరింపబడిన ప్రక్రుతి యొక్క అణువు కూడ అలాగే నిల్వరింపబడియుండును.ఆ తరువాత రాతి అలవరిక శబ్దాలు తరుగుదల అయ్యేకొలది అందులో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులో కూడ శబ్దం తగ్గుతు వచ్చును.అలా చివరకు రాతిఅలవరిక పూర్తిగా క్షీణదశకు చేరుకొన్న యెడల శబ్దరీతియే లేకుండా పోవును.కాబట్టి రాతిఅలవరికలోని రసస్థితి ద్రావకాల నిష్పత్తులు నిల్వవున్నంతవరకు అందులో శబ్దపు అలవరిక అలాగే నిల్వరింపబడియుండును.