17.ఒక్కొక్క కాలానుభవంలో కాలగర్భం నుంచి వెలువరింపబడిన కలగర్భ సంపద :
ప్రస్తుత బాహ్యలోకములో తిండి,తీర్థము,వస్త్రము,గృహము,చెక్క,ఇవన్ని ఒక్కొక్క కాలానుసారంలో కాల గర్భం నుంచి పుట్టుకొచ్చినవే.ఆ కాలగర్భ సంపద మొదటగా మట్టిగా మొదలై ఆ భూగర్భములోనే రాయి పుట్టుక,ఇనము,ఇత్తడి,రాగి,బంగారము ఇవన్నియు మన అనుభవము యొక్క విలువలను బట్టి కాలగర్భంలో వెలువరింపబడి కాలంలోనికి ప్రవేశపెట్టబడినవి.ఎవరి అనుభవ విలువలను బట్టి వాళ్ళకు భూమాత గర్భంలో గృహోపకరణమునకై స్థలసేకరణ వాళ్ళ అనుభవ నడవడిక యొక్క లోతులను బట్టి భూములు,వాళ్ళ అనుభవంను బట్టి ఒక్కొక్క కాలములో తిండి,ఒక్కొక్క కాలానుసారికము తగ్గట్టుగా భూమాతగర్భం నుంచి పుట్టుకొచ్చే షడ్రుచులు,జీవస్థితి వివరణాత్మకంగా కదిలే దానిని బట్టి నీటివూట,ఒక్కొక్క కాలానుసారికమును బట్టి వస్తు,వస్త్ర సామాగ్రేతరము,వాళ్ళ అనుభవ విలువలను బట్టి వాటిపై వాళ్ళ యొక్క పేర్లను లిఖించి కాలక్రమములో ఇంత సమయస్థితి వరకు అని అందించును.ఆ సమయస్థితి వరకు అనుభవించి సంతృప్తి చెందవలెను.సంతృప్తి చెందిన చెందకపోయిన కాలసమఅము తీరిపోయినట్లైతే ఒక పేరు మీద నుండి మరొకరి పేరు మీదకి చేరును.ఇది కాలక్రమమే నిర్దేశించును.దీనిని బట్టి చూస్తే ఒక్కొక్క మానవనడువడి యొక్క యంత్రపరికరమునకు అన్ని కాలాల అనుభవపూర్వక నడకను బట్టి ఎంత కాలగర్భ సంపద వెలువరింపబడెనో తెలియదు.కాని మనస్సు అద్దంలో చిక్కుముల్లు వేసుకొనే దానిని బట్టి కాలక్రమములో ప్రయాణము ఆగిపోవుట ద్వారా మన యొక్క అనుభవ విలువతో కూడుకోబడిన సంపద కాలంలో వున్నప్పటికి మనకు అందదు.ఎప్పుడైతే మన అనుభవాన్ని గుర్తు ఎరిగి సరిమల్చుతామో అప్పుడే మనస్సు అద్దం లోని దారి కదలగానే భూపొరల నడుమున సారాంసయుత తీగ కదలి దారిలో ఆ సంపద మనకు కలసివచ్చును.ఒకవేళ మళ్ళి తిరిగి సరివివరణతో కూడుకోబడి ఆడలేని పక్షమున ఏదారి నుంచి వచ్చి నదో మళ్ళీ తిరిగి ఆ దారిలోనే వైదొలగును.కావున ఈరకంగా చూస్తే అనుభవ నిర్వహణ పరనడమున స్థిరస్థితితో కూడుకోబడిన అనుభవపూర్వకమైన దారులు అన్నియు వెలువడితే తప్ప స్థిరస్థితిగా ఏ ఒక్కటి మనచెంత నిలువవు.కాబట్టి గమనంలో మన యొక్క అనుభవాన్ని అంతటా గుర్తు ఎరిగి సరి మల్చుకొంటూ పోవుటయందు సరివివరణతో కూడుకోబడిన దారులలో ప్రయాణించుట యందు జీవిత కాల అనుభవ నడకలో ఎప్పుడెప్పుడు ఏఏ సమయస్థితుల యందు మన వివరణను బట్టి మనకు ఏవిఅందించవలెనో కాలమే నిర్దేశించును.ఆరకంగా చూస్తే ప్రస్తుతం ఇప్పటి వరకు నా అనుభవ విలువ అన్నది ఎంతయో కూడ నాకు తెలియదు.కాని నా అనుభవంలో నుంచి వెలువడిన ప్రతియొక్క వాటికిసంతలో ఇంత విలువ అని కట్టడము జరిగెను.వాటి అన్నిటి యొక్క తయారిదాయకమునకు కారణ మైన మానవ నడువడి యొక్క యంత్రాంగ పరికరములోని జీవప్రమాణిక నడకకు కాలం ఇంత విలువ అని కాల రూపొందింపులోనే లెక్కకట్టెను.దానిని బట్టి సంత కలబషితమైన వ్యవహారిక పరనడుమున అన్ని కాలాలకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికమునకు అవసరమైనవి అన్ని కూడ కాలక్రమంలో మన అనుభవము నుంచి వెలికితీతకు రాబడబడెను.అవన్నియు అనుభవిస్తున్నా అవి ఎందుకు మనకు లభ్యమెనౖాయని ఆలోచించని వారు కొందరు,లభ్యంకాక జీవితాన్ని అసౌకర్యంగా గడిపేవారు, మరికొందరు అవి ఎందుకు మనకు లభ్యంకాలేదని కాల అనుభవంలోనికి తొంగి చూడక పోవడం ద్వారా అసలు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో కూడ కాలక్రమంలో ఏమియు తేలలేదు.కావున మన అనుభవ విలువను బట్టి కాలగర్భం ఏఏ సంపదను వెలువరించిందో తెలియదు.కావున ఇవన్నియు అనుభవ విలువల నుంచి వెలువరింపబడుట ద్వారా అనుభవ సంపదలుగా మారెను.అనుభవమే జ్ఞానముగా పరిగణములోనికి రావటంలో కాలగర్భ సంపదంతా జ్ఞానసంపదగా మారును.