విద్యా విషయాలు

7.ఏకతా అనగానేమి ?
What is unity?

ప్రస్తుత మనం అనుభవించే మంచి,చెడు,కష్టం,సుఖం,బాధ,సంతోషం,కుళ్ళు,కుతంత్రం,తల్లి తండ్రి, భార్య భర్త,సోదరి సోదరుడు ఇవన్నీ అనుభవించిన అనుభవపూర్వకమైన లోతులు పది అడుగులు మొదలు 20 30 40 50 అడుగుల లోతులు తేలితే తప్ప ఇదంతా అనుభవమేనని తెలియవచ్చును. అలా తెలియరావడంలో విషయ సన్నివేశం తగ్గట్టుగా ప్రదర్శించే స్థితి రావలె.విషయ సన్నివేశము తగ్గట్టుగా అనగా కోపాన్ని,బాధను ఎక్కువ తక్కువలో కాకుండా ఖచ్చిత నిర్వహణలో ప్రవేశపెట్టడితేనే విషయం సాగును.అలా కాని పక్షమున విషయం పక్కదారి పట్టును.కావున అనుభవ నిర్వహణలో లోతులు వెలుబడనంత వరకు తల్లితనము పూర్తిగా తెలియదు. ఆ తల్లితనము కూడ సంపూర్ణ అర్థ నిర్వహణలోనే తల్లికోణాలని,తల్లికి బిడ్డకు మధ్య కూర్చిన అనేక విషయఅల్లికల యొక్క నడకలో తల్లితనాన్ని కొంచెం కొంచెంగా గుర్తుఎరుగుతు పోయెదము.అలా గుర్తుఎరుగుతే తప్ప తల్లికి తగ్గట్టుగా ప్రదర్శన ఒక స్థూలతొడుగు నుంచి వెలువడదు.అదే విధంగా మంచి అనే పదమునకు సంపూర్ణ అర్థం తెలియని పక్షంలో విషయ సన్నివేశము తగ్గట్టుగా మంచిని ప్రదర్శించడము రాదు.కనుకనే మంచి వెనుకనే చెడు రావడమన్నది చెడువెనుకనే మంచి రావడమన్నది జరుగును.ఈ రెండిటిని లోతులో గుర్తు ఎరుగకపోతే అనుభవనిర్వహణలో ఏకతా అన్నది అలబడనట్లే.

Download PDF Now